KTR : ఆటో డ్రైవర్లకు కేటీఆర్ భరోసా
సమస్యల పరిష్కారానికి కమిటీ
KTR : హైదరాబాద్ – రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తామని ప్రకటించారు మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR Announced for Drivers
కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. దీంతో తమ ఉపాధికి గండి ఏర్పడిందంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు.
గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. తమకు ఉపాధి లేకుండా రేవంత్ రెడ్డి చేశారంటూ ఆరోపించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆటో డ్రైవర్ల యూనియన్లతో సమావేశం అయ్యారు. వారి ఉపాధికి ఎలాంటి ఢోకా లేదంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కేటీఆర్(KTR) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా అధ్యయనం చేసేందుకు పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లడించారు.
Also Read : Jos Butler : జోస్ బట్లర్ కీలక కామెంట్స్