Jos Butler : జోస్ బ‌ట్ల‌ర్ కీల‌క కామెంట్స్

సెంచ‌రీతో సూప‌ర్ ఇన్నింగ్స్

Jos Butler : ఇంగ్లండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ద‌క్షిణాఫ్రికా టూర్ లో భాగంగా జ‌రిగిన కీల‌క వ‌న్డే సీరీస్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్. అత‌డిపై తాజా, మాజీ ఆటగాళ్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Jos Butler Key Comments

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా వ‌న్డే సీరీస్ లో అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్. కీల‌క‌మైన వ‌న్డే మ్యాచ్ లో ఏకంగా సూప‌ర్ సెంచ‌రీతో దుమ్ము రేపాడు. కేవ‌లం 114 బంతులు ఎదుర్కొని 108 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

క‌ళ్లు చెదిరే షాట్స్ తో స‌ఫారీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఒకానొక ద‌శ‌లో 2 వికెట్లు కోల్పోయి 49 ప‌రుగుల‌తో ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చాడు సంజూ శాంస‌న్. దీంతో టీమిండియా గెల‌వ‌డ‌మే కాదు 2-1 తేడాతో సీరీస్ కైవ‌సం చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా సంజూ శాంస‌న్ ప్ర‌స్తుతం ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ జ‌ట్టుకు ఓపెన‌ర్ గా ఆడుతున్నాడు ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler). మ‌రో వైపు త‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది బీసీసీఐ.

సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు. అన్ని ఫార్మాట్ ల‌లో రాణించ ద‌గిన క్రికెట‌ర్. త‌న సార‌థ్యంలో ఆడేందుకు ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ ఆస‌క్తితో ఎదురు చూస్తాడ‌ని ప్ర‌శంసించారు. అంతే కాదు శాంస‌న్ కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌న్నాడు.

Also Read : Jana Sena Party : ఓట‌ర్ల జాబితాపై ఫోక‌స్ పెట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!