Jana Sena Party : ఓట‌ర్ల జాబితాపై ఫోక‌స్ పెట్టాలి

ఎన్నిక‌ల సంఘానికి జ‌న‌సేన విన‌తి

Jana Sena Party : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే రాష్ట్రంపై ఫోక‌స్ పెట్టింది. ఈసీ టీం రెండు రోజుల పాటు ప‌ర్య‌టించింది. అధికారంలో ఉన్న వైసీపీ స‌ర్కార్ జోష్ లో ఉంది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో పాలించిన టీడీపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున త‌ప్పుడు ఓట‌ర్ల‌ను న‌మోదు చేయించార‌ని ఆరోపించింది.

Jana Sena Party Focus

ఈ మేర‌కు ఆ పార్టీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లువురు ఎంపీలు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిశారు. సుదీర్ఘ లేఖ ఇచ్చారు. టీడీపీ హ‌యాంలో చేసిన అవ‌క‌త‌వ‌కల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంతో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా ఆదివారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ(Jana Sena Party) ఫుల్ ఫోక‌స్ పెట్టింది ఎన్నిక‌ల‌పై. ఈ మేర‌కు సుదీర్ఘ లేఖ రాసింది ఈసీ టీంకు. రాష్ట్రంలో ఎన్నిక‌ల జాబితాలో ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్న వారిపై విచార‌ణ జ‌రిపించాలని పార్టీ కోరింది.

ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు లేకుండా చూడాల‌ని సూచించింది. అంతే కాకుండా అర్హ‌త లేని సిబ్బందిని ఎన్నిక‌ల విధుల‌కు ఉప‌యోగించ రాద‌ని, వారిని ప‌క్క‌న పెట్టాల‌ని స్ప‌ష్టం చేసింది జ‌న‌సేన పార్టీ. జ‌న‌సేన పార్టీ ఇచ్చిన లేఖ‌పై స్పందించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం బృందం.

Also Read : Salaar Movie : క‌లెక్ష‌న్ల పంట రికార్డుల మోత‌

Leave A Reply

Your Email Id will not be published!