Salaar Movie : క‌లెక్ష‌న్ల పంట రికార్డుల మోత‌

స‌లార్ దెబ్బ‌కు బాక్సులు బ‌ద్ద‌లు

Salaar Movie : మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు శాండిల్ వుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. త‌ను య‌శ్ తో తీసిన కేజీఎఫ్ ఇప్ప‌టికే రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ తీసినా అది కూడా హిట్ గా నిలిచింది. తాజాగా డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ తో తీసిన స‌లార్ రికార్డుల మోత మోగిస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. బాక్సులు కాసుల‌తో నిండి పోతున్నాయి. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సినిమా టికెట్ రేట్ల‌ను పెంచుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చాయి. దీంతో ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్ల పంట పండుతోంది.

Salaar Movie Collections

విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా థియేట‌ర్ల‌న్నీ కిట కిట లాడుతున్నాయి. ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ మేనియా క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం డార్లింగ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా షారుక్ ఖాన్ న‌టించిన డుంకీని దాటేసింది స‌లార్(Salaar). ముందంజ‌లో కొన‌సాగుతోంది సినిమా.

ఇదిలా ఉండ‌గా సినీ వ‌ర్గాల అంచ‌నా మేర‌కు 12, 959 షోల నుండి 48.43 ఆక్యుపెన్సీతో 18,93,174 టికెట్ల‌ను విక్ర‌యించడం విశేషం. పీవీఆర్ ద్వారా 1,80,047 టికెట్ల‌తో రూ. 6.82 కోట్లు, ఐనాక్స్ ద్వారా 1,30,135 టికెట్ల‌తో రూ. 4.50 కోట్లు, సినీ పోలిస్ ద్వారా 70,088 టికెట్ల విక్ర‌యం ద్వారా రూ. 2.61 కోట్లు వ‌సూలు అయ్యాయి. ఇక అన్ని థియేట‌ర్ల‌లో క‌లిపి దేశ వ్యాప్తంగా రూ. 43.77 కోట్లు వ‌సూలు కావ‌డం విశేషం. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు కొల్ల‌గొడుతుంద‌నేది తెలియాల్సి ఉంది.

Also Read : President Draupadi Murmu : ఆతిథ్యానికి ప్రెసిడెంట్ ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!