KTR : సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై భగ్గుమన్న కేటీఆర్

ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్‌ అవడం....

KTR : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

KTR Comment…

ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్‌ అవడం.. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Also Read : MP Avinash Reddy : పోలీసుల అదుపులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!