KTR Yellareddipeta School : ఎల్లారెడ్డిపేట బ‌డి అదుర్స్

మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌తో ఏర్పాటు

KTR Yellareddipeta School : సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది. పేద‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల మ‌న ఊరు మ‌న బ‌డి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఆయా గ్రామాల‌లో బ‌డుల‌ను క్యాంప‌స్ లుగా మార్చ‌డం , మెరుగైన రీతిలో వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం దీని ఉద్దేశం. ఆయా ప‌ల్లెల్లో చ‌దువుకుని గొప్ప స్థానాల్లో ఉన్న వారు, ముఖ్యంగా ఎన్నారైలు (ప్ర‌వాస ఆంధ్రులు, తెలంగాణ వారు) త‌మ వంతు సాయం చేయాల‌ని పిలుపునిచ్చింది. ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపున‌కు ప‌లువురు స్పందించారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర స‌ర్కార్ ఊహించ‌ని రీతిలో యూనివ‌ర్శిటీని త‌ల‌ద‌న్నేలా పాఠ‌శాల‌ను నిర్మించింది. ఇది ఎక్క‌డా కాదు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట‌లో అద్భుతంగా రూపొందించారు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠశాల‌ను . దీనిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చ‌దువుకు త‌మ స‌ర్కార్ ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు.

పిల్ల‌లు అతి పెద్ద ఆస్తులు అని పేర్కొన్నారు. విద్య‌లో పెట్టుబ‌డి భ‌విష్య‌త్తులో సిద్దంగా ఉన్న దేశాన్ని నిర్మించ‌డం త‌ప్ప మ‌రొకటి లేద‌ని తెలిపారు. మ‌న ఊరు మ‌న బ‌డి మూడు ద‌శ‌ల్లో రూ. 7,230 కోట్ల‌తో తెలంగాణ‌లోని 26,000కు పైగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను పున‌రుద్ద‌రించే ల‌క్ష్యంతో రూపొందించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Also Read : Shatrughan Sinha Rahul : రాహుల్ గాంధీ యూత్ ఐకాన్ – సిన్హా

 

Leave A Reply

Your Email Id will not be published!