KTR Vs Bandi Sanjay : కవిత బెయిల్ అంశంలో బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటిఆర్
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించిన వెంటనే కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు...
KTR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమని, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ మీరు ఒక కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై నిందలు వేస్తున్నారు!!. అది మీ హోదాకు తగదు. మీ స్థానానికి తగినది కాదు’’ అని కేటీఆర్(KTR) విమర్శించారు. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గమనించి కోర్ట్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని తాను కోరుతున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.
KTR Comment on Bandi…
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించిన వెంటనే కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు అని పేర్కొన్నారు. ‘‘ అలుపెరగకుండా మీరు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ దక్కిన విజయం. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తారు. కవిత బెయిల్ కోసం తొలుత వాదించిన అభ్యర్థిని రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడం, దానికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. నేరంలో భాగస్వాములైనవారికి అభినందనలు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహడ్ జైలులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఇవాళ ఉపశమనం దక్కింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూర్ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని, మహిళగా కూడా పరిగణించాల్సి ఉన్నందున బెయిల్ ఇస్తున్నట్టు ధర్మాసనం కారణాలుగా పేర్కొంది. నిందితురాలు ప్రస్తుతం జైలులో ఉండాల్సిన అవసరం న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు.
Also Read : MLC Kavitha : ఈసారైనా కవితకి బెయిల్ వచ్చేనా…