KTR: ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌ !

ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌ !

KTR: తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌ గా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన… లీగల్‌ యాక్షన్‌ కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్‌(KTR) ‘ఎక్స్‌’ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

KTR Serious

‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తాను. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే… లీగల్‌ గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే… వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read : Chhattisgarh Encounter: దండకారణ్యంలో ఎన్‌ కౌంటర్‌ ! 8 మంది మావోయిస్టుల మృతి !

Leave A Reply

Your Email Id will not be published!