KTR : ద‌మ్ముంటే గంగుల‌పై పోటీకి దిగు

బండి సంజ‌య్ కు కేటీఆర్ స‌వాల్

KTR : మంత్రి కేటీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు బండి సంజ‌య్ (Bandi sanjya) . ద‌మ్ముంటే మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ పై పోటీ చేయ్ అంటూ స‌వాల్ విసిరారు. క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి ఒక్క పైసా కూడా ఇంత వ‌ర‌కు తీసుకు రాలేద‌న్నారు.

ఇవాళ మంత్రి కేటీఆర్(KTR) ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. మార్క్ ఫెడ్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ప్ర‌సంగించారు. సీఎం కేసీఆర్ కు ఈ న‌గ‌రం అంటే ఎంతో ప్రేమ అన్నారు.

2001 మే 17న సింహ‌గ‌ర్జ‌న స‌భ పెట్టి తెలంగాణ పోరాటానికి నాంది ప‌లికార‌ని చెప్పారు కేటీఆర్(KTR). తెలంగాణ ఏర్పడ‌క ముందు పెన్ష‌న్ రూ. 200 ఉండేద‌ని కానీ ఇప్పుడు ఆ పెన్ష‌న్ రూ. 2016 ఇస్తున్నామ‌ని తెలిపారు.

ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీకగా రాష్ట్రం నిలిచింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం మ‌న‌ది మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

భ‌ర్త‌ల కార‌ణంగా నిరాద‌ర‌ణ‌కు గురైన మ‌హిళ‌ల‌ను కూడా ఆదుకుంటున్నామ‌ని కేటీఆర్ చెప్పారు. దివ్యాంగులకు రూ. 3, 016 ఇస్తున్నామ‌ని తెలిపారు.

కుల‌, మ‌తాల‌తో సంబంధం లేకుండా 18 ఏళ్లు పైబ‌డిన యువ‌తుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మి (Kalyana Lakshmi) , షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

ఈ ప‌థ‌కం కింద ల‌క్షా నూట ప‌ద‌హార్లు ఇస్తున్నామ‌ని చెప్పారు కేటీఆర్. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు (Karimnagar District)  మెడికల్ కాలేజీ కేటాయించామ‌న్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీగా గెలిచిన బండి సంజ‌య్ (Bandi sanjya) మూడేళ్ల‌యినా ఒక్క ప‌ని కూడా చేయ‌లేద‌ని ఫైర్ అయ్యారు కేటీఆర్. మాట‌లు త‌ప్ప చేత‌లు లేవ‌న్నారు.

Also Read : ఆర్ ఆర్ ఆర్ పై ప్ర‌జావాజ్యం తిర‌స్క‌రించిన హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!