KTR Slams : అభివృద్ది కోసం అప్పులు చేశాం – కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్

KTR Slams : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కావాల‌ని త‌మ‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఆరోపించారు. శ‌నివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

KTR Slams Congress Govt

ప్ర‌పంచంలో ఏ దేశ‌మైనా, ఏ రాష్ట్ర‌మైనా అభివృద్ది కోసం అప్పులు చేయ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డెక్క‌డ చేశామ‌నే దానిపై పూర్తి వివ‌రాలు ప‌క్కాగా ఉన్నాయ‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ఇవాళ జీడీపీ ప‌రంగా, జీఎస్టీ ప‌రంగా తెలంగాణ రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. కానీ ప‌దే ప‌దే సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న టీం త‌మ‌ను టార్గెట్ చేసుకుని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు కేటీఆర్(KTR). ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

శాస‌న స‌భ‌లో త‌మ‌ను మాట్లాడేందుకు ఛాన్స్ ఇస్తామంటూ చెబుతూనే మ‌రో వైపు త‌మ‌ను మాట్లాడ‌కుండా గొంతు నొక్కుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుత స‌ర్కార్ కు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని చెప్పారు కేటీఆర్.

Also Read : Nadendla Manohar : ఆర్బీకేలు రైతు నిరాశా కేంద్రాలు

Leave A Reply

Your Email Id will not be published!