Tirumala : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

స్వ‌ర్ణ ర‌థంపై ఊరేగ‌నున్న శ్రీనివాసుడు

Tirumala : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం కావ‌డంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆల‌యాన్ని అంగ‌రంగ వైభవంగా అలంక‌రించింది. ప్ర‌త్యేకించి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని పూల‌తో అభిషేకం నిర్వ‌హించారు పూజారులు.

Tirumala Vaikuntadwara Darshan Updates

ఇదిలా ఉండా వైకుంఠ ద్వార ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది టీటీడీ(TTD). ఇప్ప‌టికే తిరుప‌తి, తిరుమ‌ల‌లోని 10 కౌంట‌ర్ల వ‌ద్ద నాలుగున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా ఉచితంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టికెట్ల‌ను జారీ చేసింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని ద‌ర్శించుకునే భాగ్యాన్ని ప్ర‌సాదించేందుకు నిర్ణ‌యం తీసుకుంద‌ని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.

శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచే భ‌క్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాద‌శి రోజు స్వామి వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల కోరిక‌లు ఫ‌లిస్తాయ‌ని న‌మ్మ‌కం. దీంతో ఎక్క‌డ చూసినా భ‌క్త బాంధ‌వులు కొలువుతీరారు. మ‌రో వైపు ఉద‌యం స్వామి వారు స్వ‌ర్ణ ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు.

వీవీఐపీల తాకిడి మ‌రింత పెరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు బారులు తీరారు. త‌మ కుటుంబీకుల‌తో త‌ర‌లి వ‌చ్చారు స్వామి ద‌ర్శ‌నం కోసం.

Also Read : KTR Slams : అభివృద్ది కోసం అప్పులు చేశాం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!