KTR Slams : కాంగ్రెస్ శ్వేత పత్రం కేటీఆర్ ఆగ్రహం
హామీల అమలు మాటేమిటని ప్రశ్న
KTR Slams : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం పోయినా ఆయన తన తీరు మార్చుకోలేదు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బుధవారం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. తమపై కావాలని సీఎం రేవంత్ రెడ్డి పగ తీర్చుకునేలా ప్రయత్నం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
KTR Slams Congress
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల సంగతి ఏమైందో చెప్పాలన్నారు. అయితే కొంత సమయం కూడా ఇస్తామని అంటూనే ఎవరికి సంబంధించి శ్వేత పత్రం ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
ఈనెల 14 నుంచి నూతన అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
ప్రతి సంవత్సరం తాము ఇచ్చిన ఆడిట్ నివేదిక శ్వేత పత్రం కాదా అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ పరిశీలిస్తే అప్పులు, ఆదాయాల గురించి తెలుస్తుందన్నారు. ఈ మాత్రం సీఎంకు తెలియక పోవడం దారుణమన్నారు కేటీఆర్.
Also Read : Security Breanch : పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం