Kuldeep Yadav : ఐపీఎల్ 2022లో అరుదైన దృశ్యాలకు వేదికగా మారింది ముంబై. ఒక్కో జట్టులో ఒక్కరు లేదా ఇద్దరు ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తమదైన ప్రతిభతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బ్యాటర్లు, బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. అత్యంత వేగవంతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఉమ్రాన్ మాలిక ఆకట్టుకుంటే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పరంగా సత్తా చాటింది.
ప్రధానంగా కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్ , ఖలీల్ అహ్మద్ , లలిత్ యాదవ్ , ముస్తాఫిజుర రెహమాన్ చుక్కలు చూపించారు. పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఎక్కడా పరుగులు తీసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు.
పంజాబ్ జట్టు తరపున జితేశ్వర్ శర్మ ఒక్కడే రాణించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ ను 115 పరుగులకే కట్టడి చేశారు. దీంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలోనే పని పూర్తి కానిచ్చేసింది.
ఇందులో డేవిడ్ వార్నర్ 60 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. పృథ్వీ షా 41 రన్స్ తో ఆకట్టుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav )కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.
దీంతో కుల్దీప్ యాదవ్ ఈ అవార్డును తనతో పాటు అద్భుతంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ తో కలిసి పంచుకుంటున్నట్లు ప్రకటించాడు.
యాదవ్ క్రీడా స్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అతడిని అభినందిస్తున్నారు. పటేల్ తో పాటు ఇతర ఆటగాళ్లు సైతం అద్బుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడారు.
Also Read : క్రికెట్ కు కీరన్ పొలార్డ్ గుడ్ బై