Kumar Sangakkara Samson : మిస్ట‌ర్ కూల్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్

రాజ‌స్థాన్ గెలుపు వెనుక ఆ ఇద్ద‌రు

Kumar Sangakkara : ఈసారి ఐపీఎల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు అనూహ్యంగా పుంజుకుంది. గ‌త ఏడాది ఆ జ‌ట్టు మేనేజ్ మెంట్ కీలక నిర్ణ‌యం తీసుకుంది.

ఒక‌టి కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే మ‌రో వైపు జ‌ట్టుకు దిశా నిర్దేశం చేసే బాధ్య‌త‌ను ప్ర‌పంచ దిగ్గ‌జ ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర‌ను ఎంపిక చేసింది.

మొద‌ట్లో స‌త్తా చాటినా 2021 ఐపీఎల్ లో ఆశించినంత మేర రాణించ‌లేక పోయింది. కానీ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా ఐపీఎల వేలంలో కీల‌క ఆట‌గాళ్ల‌ను తీసుకోవ‌డంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తెలివిగా వ్య‌వ‌హ‌రించింది.

ఇందులో ప్ర‌ధానంగా శాంస‌న్ , సంగ‌క్క‌ర కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. సంగ‌క్క‌ర అంటే ఆట‌గాడు మాత్ర‌మే కాదు పూర్తి పాజిటివ్ మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తి. ఓడి పోతే బాధ ప‌డ‌టం, గెలిస్తే ఆనంద ప‌డ‌టం అంటూ ఉండ‌దు.

రెండింటిని స‌మానంగా చూసేలా చేయ‌డం, జ‌ట్టు ఆటగాళ్ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుద‌ర్చ‌డం, ఏ స్థితిలోనైనా స‌త్తా చాటేలా ప్లేయ‌ర్ల‌ను తీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డాడు సంగ‌క్క‌ర‌.

ఇప్పుడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఊహించ‌ని రీతిలో స‌త్తా చాటుతూ ముందుకు వెళుతోంది. ఆ జ‌ట్టును ఎదుర్కోవ‌డం రోజు రోజుకు ఇత‌ర జ‌ట్ల‌కు ఇబ్బందిగా మారింది.

దీని వెనుక కుమార సంగ‌క్క‌ర (Kumar Sangakkara)ఉన్నాడు. అత‌డి పాజిటివ్ అటిట్యూడ్ , కెప్టెన్ శాంస‌న్ మెత‌క వైఖ‌రి , ప‌ట్టుద‌ల చివ‌ర‌కు విజ‌యాల బాట ప‌ట్టించేలా చేశాయి.

ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాజ‌సం వెనుక మిస్ట‌ర్ కూల్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ ఉన్నార‌నేది స్ప‌ష్ట‌మైంది.

Also Read : గుజ‌రాత్ జోరు సాగేనా కోల్ క‌తా నెగ్గేనా

Leave A Reply

Your Email Id will not be published!