Kumar Sangakkara : వెల్ డన్ బాయ్స్ – సంగక్కర
ఓటమి నుంచి గుణపాఠాలు
Kumar Sangakkara : ఐపీఎల్ 16వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి దాకా మూడు మ్యాచ్ లు ఆడింది. హైదరాబాద్ , ఢిల్లీతో గెలుపొందగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అస్సాం లోని గౌహతిలో జరిగిన కీలక పోరులో పరుగుల వరద పారించారు రాజస్థాన్ ఆటగాళ్లు. యంగ్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ దుమ్ము రేపాడు. 60 పరుగులతో సత్తా చాటాడు.
ఇక స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇద్దరూ సమానంగా 11 ఫోర్లు ఒక సిక్సర్ తో ఆకట్టుకున్నారు. సంజూ శాంసన్ డకౌట్ కాగా రియాన్ పరాగ్ 7 పరుగులే చేసి నిరాశ పరిచారు. ధ్రువ్ జురెల్ 8 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇక కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న విండీస్ స్టార్ షిమ్రోన్ హిట్మెయర్ 4 సిక్సర్లు ఒక ఫోర్ తో దుమ్ము రేపాడు.
అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 142 పరుగులకే చాప చుట్టేసింది. 52 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేక పోయింది.
జట్టు విజయం సాధించిన అనంతరం జట్టు సభ్యులను ఉద్దేశించి డ్రెస్సింగ్ రూమ్ లో కుమార సంగక్కర(Kumar Sangakkara) మాట్లాడాడు. ఇలాగే ఆడుతూ పోతే కప్ గెలవడం సులభమేనని పేర్కొన్నాడు. ఈ సదర్బంగా జైశ్వాల్ , బట్లర్ , హిట్మెయర్ ను అభినందించాడు.
Also Read : ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటా – రహానే