Kumar Sangakkara Samson : సంజూ శాంసన్ దమ్మున్నోడు – సంగక్కర
ప్రశాంతంగా ఆడితే కెరీర్ కు ఢోకా లేదు
Kumar Sangakkara Samson : శ్రీలంక మాజీ కెప్టెన్ , రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. భారత్ లో శ్రీలంకతో ఆడే టీ20 సీరీస్ కు మాత్రమే ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదే సమయంలో వన్డే సీరీస్ కు దూరం పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో తాను చూసిన ఆటగాళ్లలో ప్రస్తుతం అద్భుతమైన ఆటగాళ్లలో ఎక్కువ మార్కులు మాత్రం సంజూ శాంసన్ కు ఇస్తానని స్పష్టం చేశాడు కుమార సంగక్కర(Kumar Sangakkara).
శ్రీలంకతో ఆడబోయే శాంసన్ కు కీలక సూచనలు చేశాడు. ఆట పట్ల ప్రేమ, అంకితభావం ఉన్న ఆటగాడు శాంసన్ అని పేర్కొన్నాడు. అయితే వన్డే సీరీస్ కు ఆడడం లేదన్న విషయాన్ని పక్కన పెట్టాలని సూచించాడు. కూల్ గా ఉండాలని, క్రికెట్ లో ఏ ఫార్మాట్ లోనైనా సరే ఆడగలిగే సమర్థవంతమైన క్రికెట్ సంజూ శాంసన్ అని కితాబు ఇచ్చాడు కుమార సంగక్కర. లంకతో ఇదే ఆఖరి సీరీస్ అని అనుకోవద్దని హెచ్చరించాడు.
కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టాలని , క్రీజులో ఎక్కువ సేపు నిలబడలిగేలా చూసు కోవాలని సూచించాడు. జట్టులో తన పాత్ర ఏమిటో ముందుగా ఆలోచించుకోవాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేరు..క్రికెట్ ఫార్మాట్ వేరు అన్నది తెలుసు కోవాలని స్పష్టం చేశాడు కుమార సంగక్కర(Kumar Sangakkara). పర్మినెంట్ ఒకే స్థానం కోసం డిసైడ్ కావద్దని ఏ స్థానంలో ఆడమన్నా ఓకే చెప్పేందుకు సిద్దంగా ఉండాలన్నాడు మాజీ క్రికెట్ దిగ్గజం.
Also Read : రిషబ్ పంత్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా