Kumara Swamy : కర్ణాటక – మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో రైతులకు 5 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కానీ అందమైన అబద్దాలు చెబుతూ మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు కుమార స్వామి.
Kumara Swamy Comment on CM Siddaramaiah
సిద్దిరామయ్యను టెంపరరీ (తాత్కాలిక) సీఎం అని, డీకే శివకుమార్ ను డూప్లికేట్ (నకిలీ) డిప్యూటీ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు వెళ్లి నిరాధారమైన ఆరోపణలు చేయడం, అందమైన అబద్దాలు చెబుతూ పవర్ లోకి రావాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు కుమార స్వామి.
ఐదు గ్యారెంటీల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కానీ జనం కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ సీఎం. వీరు చెప్పే మాటలన్నీ శుష్క వాగ్ధానాలని మండిపడ్డారు. ఉట్టికి ఎగరలేనమ్మ నిచ్చెన మెట్లు ఎక్కిందన్నచందంగా వీరి హామీలు ఉన్నాయని ఫైర్ అయ్యారు.
కర్ణాటకలో సక్సెస్ కాలేని వాళ్లు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారంటూ కుమార స్వామి(Kumara Swamy) ప్రశ్నించారు. మరోసారి బీఆర్ఎస్ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు జేడీఎస్ చీఫ్. ఏది ఏమైనా సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు అబద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు.
Also Read : Revanth Reddy : గులాబీ నేతల నాటకాలు చెల్లవ్