Revanth Reddy : గులాబీ నేత‌ల నాట‌కాలు చెల్ల‌వ్

నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ పేరుతో నిట్ట నిలువునా దోపిడీకి పాల్ప‌డ‌డమే కాకుండా చివ‌ర‌కు గెల‌వ‌లేమ‌న్న భ‌యంతో త‌మ వారిపై దాడుల‌కు దిగుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కోడి క‌త్తి లాంటి డ్రామాలు తిరిగి పున‌రావృతం కావ‌డం దారుణ‌మ‌న్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇదంతా బీఆర్ఎస్ వెనుక ఉండి ఎవ‌రు న‌డిపిస్తున్నారో జ‌నానికి తెలుస‌న్నారు.

Revanth Reddy Slams BRS

రేవంత్ రెడ్డి నేరుగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ పై. త‌న‌తో బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడ‌ని, ఆ మేరకే బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చిల్ల‌ర వేషాలు వేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు రేవంత్ రెడ్డి.

తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు టీపీసీసీ చీఫ్. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై జ‌రిగిన దాడులు వారంత‌కు వారు చేసుకున్న‌వే త‌ప్పా తాము చేసిన‌వి కాద‌న్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న వారిపై తాము ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు.

Also Read : Palvayi Sravanthi Reddy : గులాబీ గూటికి పాల్వాయి

Leave A Reply

Your Email Id will not be published!