Kunamaneni Samba Siva Rao : మేల్కోక పోతే సింగరేణి మిగలదు
కూనమనేని సాంబశివ రావు కామెంట్స్
Kunamaneni Samba Siva Rao : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు తలమానికంగా పేరు పొందింది సింగరేణి కాలరీస్. ఈనెల 27న బుధవారం కార్మిక యూనియన్ల మధ్య ఎన్నికలు పోటీ జరగనున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేశాయి. 64 సీట్లతో హస్తం అధికారంలోకి వచ్చింది.
Kunamaneni Samba Siva Rao Comment
తాజాగా సింగరేణి కాలరీస్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివ రావు(Kunamaneni Samba Siva Rao). మానవ తప్పదాల కారణంగా సింగరేణి మాగాణం కష్టాల్లోకి కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కొలువు తీరిన ప్రభుత్వం ఫోకస్ పెట్టక పోయినట్లయితే మరో 20 ఏళ్లలో సింగరేణి కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ మధ్య కాలంలో కొత్తగా గనులు రాక పోతే సింగరేణి కాలరీస్ చరిత్రగా మిగిలి పోనుందన్నారు కూనమనేని సాంబశివ రావు. గులాబీ నేతలు చెమట చుక్కలు చిందించారని, తెలంగాణను అప్పులపాలు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ధనం ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియడం లేదన్నారు.
Also Read : Salaar Movie Record : సలార్ రికార్డుల మోత