Salaar Movie Record : స‌లార్ రికార్డుల మోత

భారీ ధ‌ర‌కు ఓటీటీలోకి

Salaar Movie Record : డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన శాండిల్ వుడ్ కు చెందిన ప్ర‌శాంత్ నీల్ దుమ్ము రేపాడు. త‌ను ప్ర‌భాస్, శ్రుతీ హాస‌న్ తో క‌లిసి తీసిన స‌లార్ మూవీ వ‌సూళ్ల‌లో ఊచ కోత కోస్తోంది. విడుద‌లైన బెనిఫిట్ షో నుంచి నేటి దాకా కాసులు కురిపిస్తోంది. బాక్సులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. తొలి రోజు ఏకంగా రూ. 175 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

Salaar Movie Records

రెండు, మూడు రోజుల‌లో రూ. 450 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం మ‌రో రికార్డు న‌మోదు చేసింది. డార్లింగ్ ప్ర‌భాస్ మేనియాకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇండియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున స‌లార్ ను ఆద‌రిస్తున్నారు. గ‌తంలో సినిమాల కంటే ఎక్కువ‌గా భారీగా ఆద‌రిస్తుండ‌డం విస్తు పోయేలా చేసింది.

క‌లెక్ష‌న్ల వారీగా చూస్తే 1వ రోజు రూ. 176.52 కోట్లు వ‌సూలు సాధించ‌గా 2వ రోజు రూ. 101.39 కోట్లు, 3వ రోజు రూ. 95.24 కోట్లు, 4వ రోజు రూ. 76.91 కోట్లు వ‌సూల‌య్యాయి. మొత్తంగా నాలుగు రోజులు పూర్త‌య్యే స‌రికి రూ. 450.06 కోట్లు రావ‌డంతో స‌లార్(Salaar) టీం జోష్ లో ఉంది.

మ‌రో వైపు ఓటీటీ ప‌రంగా ప్ర‌శాంత్ నీల్ తీసిన స‌లార్ రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన‌ట్లు టాక్. ఏకంగా రూ. 350 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి పోటీ ప‌డి చేజిక్కించు కోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Also Read : CSK CEO : రోహిత్ ను కొనేంత డ‌బ్బులు లేవు

Leave A Reply

Your Email Id will not be published!