CSK CEO : రోహిత్ ను కొనేంత డ‌బ్బులు లేవు

చెన్నై సూప‌ర్ కింగ్స్ సిఇఓ వెల్ల‌డి

CSK CEO  : త‌మిళ‌నాడు – వ‌చ్చే ఏడాది ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి మినీ వేలం పాట దుబాయ్ లో ముగిసింది. ఆయా జ‌ట్ల‌కు సంబంధించి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి 10 ఫ్రాంచైజీలు. 332 ఆట‌గాళ్లు వేలం పాట‌కు వ‌స్తే 77 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేశాయి. అత్య‌ధికంగా రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయారు మిచెల్, ప్యాట్ క‌మిన్స్. ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఆస్ట్రేలియా టీమ్ కు చెందిన వాళ్లు కావ‌డం విశేషం.

CSK CEO Confirmation

ఇది ప‌క్క‌న పెడితే గుజ‌రాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యా ను ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో మేనేజ్మెంట్ క‌నీసం మాట మాత్రంగానైనా త‌న‌కు ఫోన్ కూడా చేసి చెప్పలేదంటూ వాపోయాడు రోహిత్ శ‌ర్మ‌.

ఇదిలా ఉండ‌గా హిట్ మ్యాన్ ను త‌మ‌తో ఆడాల‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) సీఈవో శ్రీనివాసన్. రోహిత్ శ‌ర్మను కొనుగోలు చేసేంత డ‌బ్బులు త‌మ వ‌ద్ద లేవ‌ని స్ప‌ష్టం చేశారు. తాము ఆయ‌న‌ను త‌మ జ‌ట్టు త‌ర‌పున ఆడాల‌ని కోర‌లేద‌న్నారు. ఇదంతా వ‌ట్టి ప్ర‌చార‌మేన‌ని పేర్కొన్నారు సిఇవో.

Also Read : Nakka Anand Babu : న‌మ్మ‌క ద్రోహం జ‌గ‌న్ నైజం – న‌క్కా

Leave A Reply

Your Email Id will not be published!