Kushboo Slams : బండారు కామెంట్స్ ఖుష్బూ సీరియస్
మంత్రి ఆర్కే రోజా సెల్వమణికి మద్దతు
Kushboo Slams : తమిళనాడు – ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఖుష్బూ(Kushboo) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ చౌదరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Kushboo Slams Bandaru Satyanarayana
ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఒక మహిళా నాయకురాలిగా తాను సిగ్గు పడుతున్నానని పేర్కొన్నారు. ఒక సీనియర్ లీడర్ గా, మాజీ మంత్రిగా తన స్థాయిని మరిచి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా సెల్వమణిపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పార్టీలు వేరైనా మహిళలు అంతా ఒక్కటేనని పేర్కొన్నారు. ఇలాంటి చౌకబారు, నీచమైన భాషను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే బండారు సత్య నారాయణ చౌదరిని నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇది పూర్తిగా సభ్య సమాజానికే కాదు యావత్ మహిళా సమాజానికి సిగ్గు చేటుగా ఆమె అభివర్ణించారు. నరనరాన పురుష అహంకారంతో వ్యవహరించే బండారును బజారుకీడ్చాలని కోరారు. ఇలాంటి వాళ్లను సమాజంలో ఉండనీయకుండా చేయాలని స్పష్టం చేశారు నటి ఖుష్బూ.
Also Read : Minister KTR : త్వరలో ఆసరా పెన్షన్ల పెంపు