Kushitha Actress : హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఫుడింగ్ పబ్ వ్యవహారం కలకలం రేపింది. తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడి చేసి 150 మందిని పట్టుకున్నారు. ఆ తర్వాత మాట మార్చారు.
కేవలం 142 మంది మాత్రమే ఉన్నారంటూ డీసీపీ వెల్లడించారు. మెగా ఫ్యామిలీకి చెందిన నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ను నాలుగు గంటల పాటు స్టేషన్ లో కూర్చో బెట్టుకున్నారు.
చివరకు వదిలి వేశారు. ఏమైందో ఏమో కానీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ పబ్ , ర్యాడిసన్ హొటల్ ది కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూతురి పేరుపై ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఇక పబ్ నడిపిస్తున్నది ఎవరో కాదు నిత్యం హిందూ జపం చేసే బీజేపీ నాయకురాలు ఉప్పల శారద కొడుకుది. ఇక పట్టుబడిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడు ప్రవీణ్ రెడ్డి ఉన్నారని పోలీసులే లీక్ ఇచ్చారు.
ఈ వ్యవహారం ఎంత దాకా పోయిందంటే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరకు పోలీసులు వివరాలు ప్రకటించే సరికి గమ్మునుండి పోయారు. పట్టుబడిన వారిలో షార్ట్ ఫిలింకు చెందిన నటి కల్లపు కుషిత(Kushitha Actress ) ఉండడం విశేషం.
ఈ సందర్భంగా ఆమె చిలుక పలుకులు పలుకుతోంది. తాను డ్రగ్స్ కోసం వెళ్లలేదని, సమోసాలు దొరుకుతాయని, మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్లానని అంటోంది. తాను అమాయకురాలినని తనకు ఏమీ తెలియదని చెబుతోంది.
Also Read : మళ్లీ గొంతు సవరించుకుంటున్న రజనీకాంత్ సతీమణి