KV Vijayendra Prasad : ఎవరీ విజయేంద్ర ప్రసాద్ అనుకుంటున్నారా. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును కలిగిన రచయిత. ఆయన పూర్తి పేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్(KV Vijayendra Prasad).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొవ్వూరు స్వస్థలం. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయన ఎవరో కాదు దేశం గర్వించ దగిన దిగ్గజ దర్శకుల్లో
టాప్ లో ఉన్న ఎస్ఎస్ రాజమౌళికి తండ్రి. స్క్రీన్ రైటర్ తో పాటు ఫిల్మ్ డైరెక్టర్ కూడా.
గతంలో ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్రం అతడిని మోదీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయనతో పాటు మ్యాస్ట్రో ఇళయరాజా,
పరుగుల రాణి పీటీ ఉష, కర్ణాటకకు చెందిన ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే ను గుర్తించి గౌరవించింది.
బహు భాషల్లో ఆయన రచయితగా రాణించారు ప్రత్యేకించి సినిమా రంగానికి సంబంధించి. కన్నడ, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో వి. విజయేంద్ర ప్రసాద్(KV Vijayendra Prasad) రాసిన రచనలు ప్రజాదరణ పొందాయి.
ఆయన రాసిన వాటిలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. వాటిలో ప్రభాస్ నటించిన బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ (రుధిరం.రౌద్రం.రణం) , బజరంగీ భాయిజాన్ , మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ , మగధీర, మెర్సల్ వంటి చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా ఉన్నారు విజయేంద్ర ప్రసాద్.
2011లో రాజన్న చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. బజరంగీ భాయిజాన్ చిత్రానికి
2016లో ఉత్తమ కథగా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందారు.
6 జూలై 2022లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విజయేంద్ర ప్రసాద్ ను ఎగువ సభకు నామినేట్ చేశారు. ఆయనకు మరో కొడుకు ఉన్నాడు.
అతడే జగమెరిగిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. మరో సంగీత దర్శకులుగా పేరొందిన ఎంఎం శ్రీలేఖ, కళ్యాణి మాలిక్ లకు మేనమామ అవుతారు.
ఇక విజయేంద్ర ప్రసాద్ పలు విజయవంతమైన సినిమాలకు కథలు అందించారు. వాటిలో అర్ధాంతి, శ్రీకృష్ణ, రాజన్న, శ్రీవల్లి సినిమాలకు
దర్శకత్వం వహించారు.
రచయితగా సినిమాలకు సంబంధించి జానకి రాముడు, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, బంగారు కుటుంబం, శారద బుల్లోడు,
అప్పాజీ ఉన్నాయి. వీటితో పాటు కురుబనా రాణి , రానా, సమర సింహారెడ్డి, సింహాద్రి, సై , విజయేంద్ర వర్మ, నా అల్లుడు, ఛత్రపతి, పాండు రంగ విట్టల,
విక్రమార్కుడు, యమ దొంగ, మిత్రుడు, సిరుతై, రౌడీ రాథోడ్ ఉన్నాయి.
ఇక బజరంగీ భాయిజాన్ , జాగ్వార్ , బాహుబలి, మెర్సల్ , మణికర్ణిక, తలైవి, ఆర్ఆర్ఆర్ , సీత ది అవతారం, అపరాజిత అయోధ్య, పవన్ పుత్ర
భాయిజాన్ , విక్రమార్కుడు -2 , రౌడీ రాథోడ్ -2 , నాయక్ -2 చిత్రాలకు రాశాడు. స్టార్ ప్లస్ లో వస్తున్న ఆరంభ్ కు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలు రాశారు.
Also Read : దిగ్గజాలకు కేంద్రం అరుదైన గౌరవం