Kyle Mayers : రెచ్చి పోయిన కైల్ మేయర్స్
అయినా లక్నోకు తప్పని ఓటమి
Kyle Mayers IPL : ఐపీఎల్ 16వ సీజన్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. రికార్డులు చెరిగి పోతున్నాయి. ఆటగాళ్లు తమదైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. కోట్లాది అభిమానుల ఆశలకు తగ్గట్టే ఆటగాళ్లు రాణిస్తున్నారు. తమదైన మార్క్ తో దుమ్ము రేపుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన కైల్ మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 218 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో ధాటిగా ప్రారంభించినా చివరకు లక్ష్య ఛేదనలో చతికిల పడింది. దీంతో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
మొయిన్ అలీ తన అద్భుతమైన బౌలింగ్ తో బోల్తా కొట్టించాడు. నికోలస్ పూరన్ 18 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్సర్లతో 32 రన్స్ చేస్తే వెస్టిండీస్ కు చెందిన స్టార్ క్రికెటర్ కైల్ మేయర్స్(Kyle Mayers IPL) షాన్ దార్ ఇన్నింగ్స్ తో రెచ్చి పోయాడు. కేవలం 22 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మేయర్స్ 53 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్ లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. అతి తక్కువ బంతులు ఎదుర్కొన్న కైల్ మేయర్స్ ఏకంగా 240.91 స్ట్రైక్ రేట్ తో జోర్దార్ ఇన్నింగ్స్ తో అబ్బుర పరిచాడు.
అతని ఇన్నింగ్స్‌లో 240.91 స్ట్రైక్ రేట్‌తో 8 ఫోర్లు మరియు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ఐపీఎల్ వేలం పాటలో లక్నో సూపర్ జెయింట్స్ కైల్ మేయర్స్ ను(Kyle Mayers) రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. రెండు మ్యాచ్ లు ఆడి 126 పరుగులు చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 73 రన్స్ చేశాడు.
Also Read : మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్