KL Rahul : భారత క్రికెట్ జట్టు ఇప్పుడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
విరాట్ కోహ్లీని తప్పించాక అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు నాయకత్వాన్ని అప్పగించింది. మనోడు గాయం కారణంగా సఫారీ టూర్ కు పూర్తిగా దూరమయ్యాడు.
దీంతో టీ20, వన్డే జట్లకు కేఎల్ రాహుల్(KL Rahul )కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో టెస్టు స్కిప్పర్ గా విరాట్ కోహ్లీని కొనసాగించింది.
తను కూడా రెండో టెస్టు కు వెన్ను నొప్పి ఉందంటూ తప్పుకున్నాడు. సెంచూరియన్ లో విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత రెండు, మూడు టెస్టుల్లో చేతులెత్తేసింది.
దీంతో 1-2 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయింది. కోహ్లీ తప్పు కోవడంతో కేఎల్ రాహుల్(KL Rahul )నాయకుడిగా ఉన్నాడు. వెంకటేశ్ అయ్యర్ ఉన్నప్పటికీ అతడిని వాడుకోలేదు. దీనిపై పెద్ద విమర్శలే వచ్చాయి.
ఆ తర్వాత వన్డే సీరీస్ స్టార్ట్ అయ్యింది. మూడు వన్డేలు వరుసగా ఓడి పోయింది టీమిండియా. భారత ఆటగాళ్లు పూర్తి స్థాయిలో రాణించ లేక పోయారు. ధావన్ ఒక్కడే ఈ మూడింటిలో మెరిశాడు.
ఇక ఫస్ట్ , లాస్ట్ వన్డే లో కోహ్లీ రాణించాడు. రెండో వన్డే లో డకౌట్ అయ్యాడు. పంత్ రెండో వన్డేలో 85 పరుగులతో మెరిశాడు. కెప్టెన్ రాహుల్ ఆశించిన రీతిలో రాణించ లేక పోయాడు.
ఇతడిని ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో ఏకంగా రూ. 17 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా కేఎల్ రాహుల్ నాయకత్వ లోపం , రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పనితీరు పని చేయలేదన్న విమర్శలు ఊపందుకున్నాయి.
ఇకనైనా బీసీసీఐ మరోసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది.
Also Read : టైటిల్ గెలిచిన పీవీ సింధు