Lakhimpur Kheri Comment : అంద‌ని న్యాయం ఎవ‌రికి చుట్టం

ల‌ఖింపూర్ ఖేరీ కేసుకు ఏడాది పూర్తి

Lakhimpur Kheri Comment : ఈ దేశంలో చ‌ట్టం కొంద‌రికి చుట్టంగా ప‌ని చేస్తోంది. అంద‌రికీ స‌మ న్యాయం అందించాల్సిన స‌ర్వోన్న‌త న్యాయ స్థానం స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ లేద‌నే ఆరోణ‌లు ఎదుర్కొంటోంది.

ప్ర‌ధానంగా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌దిలించిన ఉద్యమం. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా వేలాది మంది రైతులు సాగించిన పోరాటం. భార‌త దేశ చ‌రిత్ర‌లో అదో సువ‌ర్ణ అధ్యాయం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

పాల‌కులు ఎవ‌రైనా స‌రే ప్ర‌జ‌ల‌కు త‌ల వంచాల్సిందే అని చెప్పిన తీరు కు యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయింది. క‌రడు గ‌ట్టిన జాతీయ వాదిగా పేరొందిన భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సాక్షాత్తు జాతిని ఉద్దేశించి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

మొత్తం త‌న ఎనిమిదేళ్ల కాల పాల‌నలో ఇదొక్క‌టే ప్ర‌ధానికి మైన‌స్ పాయింట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ సుదీర్ఘ పోరాటంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.

ఇప్ప‌టికీ వారికి సాయం అంద‌లేదు. అడ‌పా ద‌డ‌పా ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేసిన దాఖ‌లాలు లేవు. సాగు చ‌ట్టాలు ర‌ద్దు చేసినా ఈరోజు

వ‌ర‌కు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదు. ఆనాట నుంచి నేటి దాకా సంచ‌ల‌నం సృష్టించిన యూపీ లఖింపూర్ ఖేరీ కేసు ఇవాల్టితో ఏడాది పూర్త‌యింది.

సాక్ష్యాలు బ‌లంగా ఉన్నా, నిందితులు ఎవ‌రో తెలిసినా ఈరోజు వ‌ర‌కు తీర్పు చెప్పేందుకు న్యాయ స్థానం సాహ‌సించ‌డం లేదు. కేసును నీరు గార్చాలంటే

తీర్పు చెప్ప‌కుండా వాయిదా వేస్తూ పోవ‌డమేన‌ని న్యాయ‌మూర్తులు న‌మ్ముతున్నారు.

అందు వ‌ల్లే న్యాయం ఎండ‌మావిగా మారింది. గాలిలో దీపంగా ప‌రిణ‌మించింది. ఈ ఘ‌ట‌న‌లో త‌మ వారిని కోల్పోయిన కుటుంబాలు నేటికీ న్యాయం కోసం

ఎదురు చూస్తున్నాయి. ఏదో ఒక రోజు త‌మ‌కు ఊరట ల‌భిస్తుంద‌ని భావిస్తున్నాయి.

కానీ ఆ వైపు సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. కార‌ణం ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి త‌న‌యుడు ఇంకా జైలులోనే ఉన్నాడు.

ఉన్న‌ట్టుండి సుప్రీంకోర్టు చేసిన మంచి ప‌ని ఒక్క‌టే. అదేమిటంటే అల‌హాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తే అది త‌ప్ప‌ని జైలులోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

సీజేఐ మారినా సీన్ మార లేదు. ల‌ఖింపూర్(Lakhimpur Kheri) జ‌రిగిన హింసాకాండ‌లో బాధితుల‌కు ఇంకా ప‌రిహారం అంద‌లేద‌ని స‌యుంక్త కిసాన్ మోర్చా రాసిన లేఖ‌లో పేర్కొంది.

గ‌త ఏడాది ఇదే అక్టోబ‌ర్ 3న టికునియా గ్రామంలోని ల‌ఖింపూర్ ఖేరీలో యూపీ డీప్యూటీ సీఎం కేశ‌వ్ ప్రసాద్ మౌర్య టూర్ కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న తెలిపారు.

ఆ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మ‌ర‌ణించారు. అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా వారిపైకి దూసుకు వ‌చ్చిన కారులో ఉన్నార‌ని తేలింది. మంత్రిని

కేబినెట్ నుంచి తొల‌గిస్తేనే బాధిత కుటుంబాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు రైతు నేత రాకేశ్ టికాయ‌త్.

పాల‌క వ్య‌వ‌స్థ న్యాయ వ్య‌వ‌స్థ‌ను, రాజ్యాంగాన్ని గుర్తించ‌దు..దానికి విశ్వాసం కూడా లేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ గొంతుల‌ను మాత్ర‌మే

పెంచ‌గ‌ల‌రు త‌ప్ప ఏమీ చేయ‌లేర‌న్నారు.

మొత్తంగా ఉన్నోళ్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని పేద‌ల‌కు కాద‌ని చెప్ప ద‌ల్చుకుందా స‌ర్వోన్న‌త న్యాయ స్థానం.

Also Read : మునుగోడులో ఉప ఎన్నిక వేడి

Leave A Reply

Your Email Id will not be published!