Lakshmi Ganesha Comment : లక్ష్మి..గణపతి సరే అంబేద్కర్ వద్దా
భారత కరెన్సీ పై గాంధీ చిత్రం
Lakshmi Ganesha Comment : భారత దేశంలో ఎప్పుడే ఎలాంటి వివాదం రాజుకుంటుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇతర దేశాలలో కంటే ఇక్కడ మాత్రం కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలతో కొట్టుకు చావడమే తప్పా మరొకటి లేదు. కానీ రాజకీయాలకు ఉన్నంత ప్రాధాన్యత ఇంకెందుకూ ఉండదు.
ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా , వ్యాపార, వాణిజ్య, మహిళా, క్రీడా రంగాలన్నీ రాజకీయాలతో ముడి పడి ఉంటాయి. అగ్గిని రాజేసి, మనుషుల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే సంస్కృతి ఆయా రాజకీయ పార్టీలు, వాటిని నమ్ముకుని ఎగదోసే మనస్తత్వం కలిగిన పాలకులది.
మాటలతో మంటలు రేపి ఉన్నట్టుండి ఘర్షణలకు తెర తీసే ప్రయత్నం ప్రతిసారి కొనసాగుతూ వస్తూనే ఉంది. స్వాతంత్రం రాక ముందు
నుంచి 75 ఏళ్ల స్వేచ్ఛ లభించినా నేటికీ ఇంకా మనస్పర్థలతో, ద్వేషాలతో , నిత్యం ఘర్షణలతో కొట్టు మిట్టాడుతోంది నవ భారతం.
137 కోట్ల భారతీయుల జనాభా కలిగిన సమున్నత భారత దేశం ఇంకా సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
అందని ద్రాక్ష పండులాగా మారి పోయింది. న్యాయం, చట్టం, అధికారం, బ్యూరోక్రసీ, రాజకీయం అన్నీ ఒక్కటై ఇవాళ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది.
ఎన్ని తరాలు మారినా, ఎన్ని పార్టీలు ఏర్పడినా ఇంకా పేదలు, నిరుపేదలు, నిమ్న వర్గాలు , బహుజనుల బతుకులు గాలిలో దీపం లాగా మారాయి. వజ్రోత్సవాల స్వేచ్ఛాయుత సంబురాలలో మునిగి పోతున్న వేళ ఈ దేశంలో పేదరికం స్థాయి ప్రపంచంలో 107కి దిగజారింది.
ఆకలి కేకల మంటలతో అల్లాడుతోంది. ఈ తరుణంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు నీతి తప్పి, గతి తప్పి చిల్లర రాజకీయాలు చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఈ తరుణంలో మరో నిప్పును రాజేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి భారతీయ కరెన్సీ నోట్ల కట్టలపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ తప్పనిసరిగా ఉంటుంది. ఇది దాని విలువను తెలియ చేస్తుంది.
తాజాగా గాంధీతో పాటు కోట్లాది హిందువులు ఆరాధించే శ్రీలక్ష్మీ దేవిని, విఘ్నాలు తొలగించే వినాయకుడిని(Lakshmi Ganesha) ముద్రించాలని కోరారు సీఎం.
ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) లేఖ కూడా రాశారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ , ఇతర పార్టీలు సైతం
తీవ్రంగా మండిపడ్డాయి. కేజ్రీవాల్ కేవలం ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకే ఇలా కామెంట్ చేశారని ఆరోపించాయి. అంతే కాదు ఆయన ఏనాడూ హిందువులను ప్రేమించిన పాపాన పోలేదని మండిపడ్డాయి.
ఇదంతా ఎన్నికల స్టంట్ అని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశానికి జాపిత గాంధీ ఎలాగో అదే స్థాయిలో భారత రాజ్యాంగ చరిత్రను రాసిన డాక్టర్ బాబా
సాహెబ్ అంబేద్కర్ ను ఎందుకు ముద్రించ కూడదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.
అవును గాంధీ..లక్ష్మీ..గణపతి సరే ఎందుకు బాబా సాహెబ్ ను ముద్రించ కూడదనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆరాధించడం సరే..కానీ దేశానికి దిశా
నిర్దేశం చేసిన మహనీయులు వీళ్లు..మరి వీళ్లను విస్మరించడం అంటే దేశానికి ..భారత జాతికి అన్యాయం చేసినట్లు కాదా..?
Also Read : పాకిస్తాన్ పై ఐఏఎస్ టాపర్ ఫైసల్ ఫైర్