Lalit Modi : ఈ బంధం మూణ్ణాళ్ల ముచ్చ‌టేనా

సుష్మితా సేన్ ఫోటో తొల‌గించిన మోడీ

Lalit Modi :  ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) ఫౌండ‌ర్ ల‌లిత్ మోడీ(Lalit Modi) ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ లో పెను మార్పును తీసుకు వ‌చ్చింది ఐపీఎల్.

దీనికి ఆద్యుడు మోడీ. కోట్లాది రూపాయ‌ల వ్యాపారం ఈ ఒక్క లీగ్ ద్వారానే కొన‌సాగుతోంది. క్రికెట్ కు ఉన్న ఆద‌ర‌ణను ముందే ప‌సిగ‌ట్టిన వ్య‌క్తి ల‌లిత్ మోడీ. బీసీసీఐలో కీల‌క ప‌ద‌విలో ఉన్నాడు.

కానీ అనుకోని రీతిలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడు. ఇదే అత‌డిని ఇబ్బందికి గురి చేసింది. ఆ త‌ర్వాత ఇత‌ర దేశాల‌కు పారి పోయాడు. లండ‌న్ లోనే త‌ల‌దాచుకున్నాడు.

అరెస్ట్ చేయాల‌ని ఎన్ని నోటీసులు పంపినా ఆ దేశపు చట్టం ఒప్పుకోవ‌డం లేదు. ఆయ‌న భార్య అనారోగ్యంతో మ‌ర‌ణించింది. అయితే ఇటీవ‌ల ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, ఒక‌ప్ప‌టి మిస్ యూనివ‌ర్శ్ సుష్మితా సేన్ తో రిలేష‌న్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

ఇద్ద‌రూ లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ‌ను క‌లిగి ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసుకుంటూ వ‌చ్చారు. ఒక‌రిపై మ‌రొక‌రు కామెంట్స్ చేసుకుంటూ, ఒక‌రినొక‌రు ప్రేమ పూర్వ‌కంగా ప‌ల‌క‌రించుకుంటూ చేశారు.

ల‌లిత్ మోడీ, సుష్మితా సేన్ క‌లిసి ఉన్న ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేశాయి. కాగా తామిద్ద‌రం క‌ల‌ల్లో తేలియాడుతున్నామ‌ని తాము అర్థం చేసుకున్నామ‌ని ట్వీట్ కూడా చేశాడు ల‌లిత్ మోడీ(Lalit Modi).

తాజాగా మోడీ ఉన్న‌ట్టుండి త‌న ప్రొఫైల్ పిక్చ‌ర్ ను మార్చ‌డంతో వీరిద్ద‌రూ విడి పోయారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు.

Also Read : ఎన్ని దాడులు చేసినా ఆధారాలు దొర‌క‌వు

Leave A Reply

Your Email Id will not be published!