Sri Lanka Bound Flights : లంక ఫ్లైట్స్ కు కేర‌ళ లైన్ క్లియ‌ర్

ధ‌న్య‌వాదాలు తెలిపిన జ్యోతిరాదిత్యా

Sri Lanka Bound Flights : ఓ వైపు ద్వీప దేశం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్ప‌టికే అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే పారి పోయాడు. కోర్టు దెబ్బ‌కు ప్ర‌ధాని మ‌హీందా రాజ‌ప‌క్సే నేవీ, ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు.

ఈ త‌రుణంలో తాత్కాలిక అధ్య‌క్షుడిగా ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన ర‌ణిలే విక్ర‌మ‌సింఘే కొలువుతీరారు. ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే త‌న ఇంటికి నిప్పంటించి, వాహ‌నాల‌ను ధ్వంసం చేయ‌డంతో ఏకంగా దేశంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాడు.

దీనిపై నిప్పులు చెరుగుతున్నారు ప్ర‌జ‌ల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు సైతం. స‌న‌త్ జ‌య‌సూర్య అయితే సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. వాళ్లు పాల‌కులు కార‌ని ప్ర‌జా కంఠ‌కులంటూ మండిప‌డ్డాడు.

ఈ త‌రుణంలో క‌నిపిస్తే కాల్చివేత ఆర్డ‌ర్స్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక‌కు చెందిన 120 విమానాల‌కు(Sri Lanka Bound Flights) కేర‌ళ ప్ర‌భుత్వం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో లైన్ క్లియ‌ర్ ఇచ్చింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని త్రివేండ్రం, కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ ల‌లో లంకకు చెందిన ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యాయి.

కాగా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి సంబంధించిన ఫ్లైట్స్ కు మార్గాన్ని సుగ‌మ‌మం చేసినందుకు కేర‌ళ ప్ర‌భుత్వానికి, సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా.

సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా ఉండేలా చేసినందుకు ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆర్థిక‌, ఆహార‌, విద్యుత్, గ్యాస్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీ‌లంక‌.

అద్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే దొడ్డి దారిన మాల్దీవుల‌కు ప‌రార‌య్యాడు. ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా ఫ్లైట్స్ ఆ దేశానికి వెళ్లేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి.

Also Read : నిన్న యుద్ధ వీరులు నేడు విల‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!