Prabath Jayasuriya : లంక బౌల‌ర్ జ‌యసూర్య అరుదైన ఫీట్

తొలి మూడు ఇన్నింగ్స్ లో రికార్డ్

Prabath Jayasuriya : ఓ వైపు శ్రీ‌లంక తీవ్ర‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక‌, ఆహార‌, ఆయిల్, గ్యాస్ , విద్యుత్ కొర‌త‌తో నానా తంటాలు ప‌డుతోంది. పాల‌న చేత‌కాక దేశ అధ్య‌క్షుడు పారి పోయాడు.

ప్ర‌ధాన మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ప్రాణ భ‌యంతో ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. ఈ త‌రుణంలో లంకేయులు మాత్రం త‌మ దేశం ప‌ట్ల అభిమానాన్ని మాత్రం వ‌దులు కోవ‌డం లేదు.

వాళ్లు తమ నేత‌ల కంటే క్రికెట్ ను, క్రికెట‌ర్ల‌ను ప్రేమిస్తున్నారు. ల‌క్ష‌లాది జ‌నం ఓ వైపు దేశ అధ్య‌క్షుడి రాజ భ‌వ‌నాన్ని ముట్ట‌డిస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం ఆస్ట్రేలియా, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.

ఇక రికార్డుల విష‌యానికి వ‌స్తే తాజాగా టెస్టు క్రికెట్ లో అరుదైన ఫీట్ సాధించాడు ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌(Prabath Jayasuriya). పాకిస్తాన్ తో జ‌రుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో క‌ట్ట‌డి చేశాడు.

పాక్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించాడు. మూడు ఇన్నింగ్స్ ల‌లో ఐదు అంత‌కంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ తో 41 ర‌న్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

అంత‌కు ముందు ఆసిస్ తో జ‌రిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ 118 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 59 ర‌న్స్ ఇచ్చి మ‌రో ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తం అత‌డి మూడు ఇన్నింగ్స్ ల్లో 17 వికెట్లు తీశాడు.

Also Read : బాబ‌ర్ ఆజ‌మ్ అరుదైన రికార్డు

Leave A Reply

Your Email Id will not be published!