Danushka Gunathilaka Arrested : లంక క్రికెటర్ గుణ తిలక అరెస్ట్
ఇక స్పందించని శ్రీలంక క్రికెట్ బోర్డు
Danushka Gunathilaka Arrested : శ్రీలంక క్రికెట్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది శ్రీలంక జట్టు. కాగా ఆ జట్టుకు చెందిన క్రికెటర్ దనుష్క గుణతిలక పై అత్యాచారం ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయాన్ని ఆసిస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దనుష్క గుణతిలక అరెస్ట్(Danushka Gunathilaka Arrested) అయ్యారన్న వార్త శ్రీలంక లో కలకలం రేపింది. అరెస్ట్ విషయానికి సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు ధ్రువీకరించలేదు. సిడ్నీలో గుణ తిలక ను అరెస్ట్ చేశారు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ జట్టు వెల్లడించింది.
ఈ ఘటన నవంబర్ 2న ఒక మహిళను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి 31 ఏళ్ల దనుష్క గుణ తిలకను ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుణతిలక రేప్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతను లేకుండానే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను విడిచి పెట్టిందని శ్రీలంక జట్టు సన్నిహిత క్రికెటర్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన గుణతిలక టి20 వరల్డ్ కప్ లో మొదటి రౌండ్ మ్యాచ్ లో నమీబియాతో ఆడాడు. డకౌట్ గా వెనుదిరిగాడు. జట్టు సూపర్ 12 స్టేజికి అర్హత సాధించినా గాయం కారణంగా గుణ తిలక గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
న్యూ సౌత్ వేల్స్ పోలీసులు శ్రీలంక జాతీయుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. కానీ పేరు మాత్రం ప్రస్తావించలేదు.
Also Read : టి20 వరల్డ్ కప్ సెమీస్ కు ఇంగ్లండ్