#RaasiKhanna : అందాలు కనువిందు చేస్తుంటే..రాశీఖన్నా హాట్ ఫొటో షూట్
సినిమా అవకాశాల కోసమే.. అమ్మడు డోస్’ పెంచుతోంది అంటున్న సినీ జనాలు
Raasi Khanna : రాశీఖన్నా.. చేప కళ్ల సుందరి.. తన కళ్లే తనకి ఎసెట్…ఆ కళ్లతో ఎన్ని హావభావాలైన పలికించవచ్చు..ఇంతవరకు తను చేసిన సినిమాలన్నీ సంప్రదాయబద్ధంగా కుటుంబ విలువలు, ప్రేమికురాలు ఇలాంటి పాత్రల్లో నటించింది. ఈ మధ్యకాలంలో యువ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో కేవలం సినిమా అవకాశాల కోసమే ఈ హాట్ హాట్ ఫోజులు ఇస్తుందా అని అనేవారూ ఉన్నారు.
చాలామంది అనేమాట.. తనకి సినిమాలు లేకపోవడమేమిటి? ఉన్న సినిమాలు చాలావా.. ఈ దిక్కుమాలిన ఆలోచన ఎందుకొచ్చిందని సీనియర్లు విసుక్కుంటున్నారు. ఇంతవరకు బాగానే పద్ధతిగా నటించింది, మంచి అమ్మాయి అనుకున్నాం కదా..ఇంతలో ఏమొచ్చింది మాయరోగం అనుకునేవారూ ఉన్నారు. ఈ కరోనా రోజుల్లో ఖాళీగా ఉండలేక, సినిమా షూటింగులు లేక, ఇలా ఫోజులిచ్చిందేమో అని ఒక రాయి అటు వేస్తూ రాశీకి సపోర్టు చేసే వారూ లేకపోలేదు. అయితే ఎవరేమని అనుకున్నా.. రాశీఖన్నా(Raasi Khanna )మాత్రం హాట్ హాట్ గా ఫొటో షూట్ చేసి ముఖ్యంగా కుర్రకారు మతులు పోగొడుతోంది.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమతో కొంచెం డోస్ పెంచిన తను..ఇప్పుడింకా ముందుకెళ్లిపోయింది. చివరికి సినిమా ఇండస్ట్రీకి వచ్చాకా.. ఎంతటివారికైనా తప్పవా..అనేవారూ ఉన్నారు. వారం రోజుల క్రితం స్వెట్టర్ మాత్రమే వేసుకొని సెక్సీ ఫొటో ఇచ్చిన అమ్మడు…ఇప్పుడు చేప పొలుసు డ్రెస్ తో అచ్చు సాగరకన్యలా దర్శనమిచ్చింది.. లేదంటే కరోనా అయిపోయేసరికి తనని అందరూ మరిచిపోకూడదని ఇలా చేస్తుందేమో అని కొందరంటున్నారు. మొత్తానికి రాశీఖన్నా(Raasi Khanna )అందరికీ భలే పనిచెప్పింది సుమా..