Lawrence Bishnoi : సల్మాన్ ఖాన్ ను ఎప్పటికీ క్షమించం
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కామెంట్స్
Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్ మోస్ట్ వాంటెడ్ కిల్లర్. అంతే కాదు తీహార్ జైలులోనే ఉంటూ మాఫియా గ్యాంగ్ ను మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడు.
దేశ వ్యాప్తంగా పేరొందిన పంజాబీ సింగర్ సిద్దూ మూసే వాలా మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం అతడిని చేర్చారు పంజాబీ పోలీసులు.
ఈ గ్యాంగ్ స్టర్ కు కృష్ణ జింకలు అంటే వల్లమాలిన అభిమానం. జింకను వెంటాడి వేటాడి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.
ఇదే సమయంలో సల్మాన్ ఖాన్(Salman Khan) తో పాటు ఆయన తండ్రికి బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై ఆరా తీస్తున్నారు ముంబై పోలీసులు.
దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది వేగవంతంగా. సల్మాన్ ఖాన్ ఎక్కడున్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ బెదిరింపు లేఖలో పేర్కొనడం కలకలం రేపింది.
ఒకసారి ట్రై చేసి కూడా ఫెయిల్ కావడం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సిద్దూ మర్డర్ తో ఒక్కసారిగా ఈ గ్యాంగ్ స్టర్ వెలుగులోకి
వచ్చాడు. ఈ కేసులో విచారణ సందర్భంగా తీహార్ జైలు నుంచి పంజాబ్ కు తీసుకు వెళ్లారు.
అక్కడ విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఎప్పటికైనా తమ టీం సల్మాన్ ఖాన్ ను మర్డర్ చేయడం ఖాయమని చెప్పినట్లు టాక్.
కృష్ణ జింక హత్యకు సంబంధించి తమ వర్గం ఎప్పటికీ సల్మాన్ భాయ్ ను క్షమించదు. ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెపితే అప్పుడు
ఆలోచిస్తామని ప్రకటించాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా జింకను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. జైలు శిక్ష ఖరారైంది. కానీ బెయిల్ పై బయట ఉన్నాడు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) దెబ్బకు సెక్యూరిటీ పెంచారు.
Also Read : ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ అదుర్స్