Amritpal Singh Case : అమృత‌పాల్ కేసులో ముగ్గురు అరెస్ట్

ముగ్గురిలో ఒక‌రు న్యాయవాది

Amritpal Singh Case : పోలీసుల క‌ళ్లు క‌ప్పి పారి పోయిన భ్రింద‌న్ వాలే 2.0 గా పేరు పొందిన అమృత పాల్ సింగ్ కేసులో(Amritpal Singh Case) కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే అత‌డికి మెంట‌ర్ గా ఉన్న ప్రపుల్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. శ‌నివారం అమృత పాల్ సింగ్ కు స‌హాయం చేసినందుకు పంజాబ్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు న్యాయ‌వాదిని కూడా అరెస్ట్ చేశారు. గ‌త మార్చి 18న ఖ‌లిస్తానీ వేర్పాటు వాద సంస్థ సానుభూతిప‌రుడిగా ఉన్నారు.

వారిస్ పంజాబ్ దే చీఫ్ గా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నాడు అమృత‌పాల్ సింగ్. ప్ర‌స్తుతం అరెస్ట్ చేసిన వారిలో ఇద్ద‌రు వ్య‌క్తులు జ‌లంధ‌ర్ జిల్లాకు చెందిన వారు కాగా మ‌రొక‌రు హోషియార్ పూర్ లోని బాబ‌క్ కు చెందిన వారు. ఇక అమృత పాల్ సింగ్ మార్చి 18న పోలీసుల క‌ళ్లు గ‌ప్పి పారి పోయాడు. ఆనాటి నుంచి నేటి దాకా పంజాబ్ పోలీసుల తో పాటు ఢిల్లీ స్పెష‌ల్ టీం గాలిస్తోంది.

ఇదే స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు అమృత పాల్ సింగ్(Amritpal Singh). తాను ఎక్క‌డికీ పారి పోలేద‌ని, తాను వేషం మార్చు కోలేద‌ని, ఒక‌వేళ అలా చేస్తే త‌న త‌ల తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఓ వీడియో సందేశంలో తాను త్వ‌ర‌లోనే ప్ర‌పంచం ముందుకు వ‌స్తాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం అమృత పాల్ సింగ్ కేసులో కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేయ‌డంతో ప‌ట్టుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు పోలీసులు.

Also Read : జ‌పాన్ పీఎంపై బాంబు దాడి

Leave A Reply

Your Email Id will not be published!