Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, లక్నో మెంటార్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు క్రికెట్ స్కిప్పర్ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లీపై సీరియస్ అయ్యాడు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు సారథ్యం అన్నది వారసత్వం కాదన్నది గుర్తుంచు కోవాలని పేర్కొన్నాడు గంభీర్(Gautam Gambhir ). భారత జట్టుకు అద్భుత విజయాలు అందించిన ధోనీ సైతం కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడని గుర్తు చేశాడు.
అంతే కాదు భారత్ కు తొలి ప్రపంచ కప్ తీసుకు వచ్చిన కపిల్ దేవ్ సైతం అజాహరుద్దీన్ సారథ్యంలో ఆడలేదా అని ప్రశ్నించాడు. అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకున్న కోహ్లీ ఇక నుంచి కెప్టెన్సీ పై కాకుండా కేవలం ఆటపై ఫోకస్ పెడితే చాలన్నాడు.
సారథ్యం వదులు కోవడం వల్ల జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవన్నాడు. స్థానాలు మారి పోతాయి తప్ప ఒరిగేది ఏమీ ఉండదన్నాడు.
టాస్ వేయాల్సి రావడం, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎప్పుడు పంపించాలనే దానిపై మాత్రమే కొంత ప్రయారిటీ ఉంటుందన్నాడు.
ఇదిలా ఉండగా కోహ్లీ అద్భుతమైన ప్లేయర్ అని కితాబు ఇచ్చాడు. టీమిండియాకు సారథిగా ఉన్న సమయంలో విజయం కోసం ఎనలేని కృషి చేశాడని పేర్కొన్నాడు.
వాస్తవానికి ఏ దేశ ప్లేయర్ కైనా దేశానికి ఆడడం మించిన గౌరవం మరొకటి ఉండదన్నారు. ఇక నుంచి విరాట్ కోహ్లీ జట్టుకు ధారాళంగా పరుగులు చేయాలని కోరాడు గౌతం గంభీర్(Gautam Gambhir ).
పనిలో పనిగా కోహ్లీ బ్యాటింగ్ ప్లేస్ లో ఎలాంటి మార్పు ఉండక పోవచ్చన్నాడు.
Also Read : టెస్టు కెప్టెన్సీకి పంత్ బెటర్