Jagdeep Dhankhar : రాజకీయ కళ్లద్దాలు వదిలేయండి – ధన్ ఖర్
విదేశాలకు వెళ్లే వారు జర జాగ్రత్త
Jagdeep Dhankhar : భారత దేశ ఉప రాష్ట్రపతి , రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్(Jagdeep Dhankhar) షాకింగ్ కామెంట్స్ చేశారు. విదేశాలకు వెళ్లే వారు ఎవరైనా సరే , ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే ముందు మన దేశం గురించి ఆలోచించాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నోరు జారకుండా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకుడు , వాయనాడు ఎంపీ అర్హతపై వేటుకు గురైన రాహుల్ గాంధీని ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ఉప రాష్ట్రపతి.
ముందు వెనుకా ఆలోచించాలి. తాము ఏం మాట్లాడుతున్నామో ఒకసారి రిహార్సల్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటా 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులపై ప్రభావం పడుతుందన్నారు. ఇది పూర్తిగా దేశ గౌరవానికి భంగం కిలగిస్తున్నామన్న సోయితో మాట్లాడాలని పేర్కొన్నారు జగదీప్ ధన్ ఖర్(Jagdeep Dhankhar) .
కొందరు పదే పదే తమ పదవులను అడ్డం పెట్టుకుని ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని దాని వల్ల నష్టం తప్ప లాభం ఏమీ ఉండదన్నారు. మాట్లాడ బోయే అంశానికి సంబంధించి ఒకటికి పదిసార్లు సరి చూసు కోవాలని, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎవరికీ మనసు నొప్పి కలిగించకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భంగం కలగకుండా మాట్లాడాలని విదేశాలకు వెళ్లే వారికి స్పష్టం చేశారు.
విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్లు ఎప్పుడైనా తమ దేశాల పట్ల చులకనగా మాట్లాడటం చూశారా అని జగదీప్ ధన్ ఖర్ ప్రశ్నించారు. ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తాము హీరోలమై పోతామని కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : అవినీతిలో కాంగ్రెస్ , బీజేపీ ఒక్కటే