S Jaipal Reddy : తెలంగాణ బిడ్డా నిను మ‌రువ‌దు ఈ గ‌డ్డ

మేరున‌గ‌ధీరుడు జైపాల్ రెడ్డి

S Jaipal Reddy :భార‌త దేశ రాజ‌కీయాల‌లో విస్మ‌రించ లేని అరుదైన నాయ‌కుడు సూదిని జైపాల్ రెడ్డి. బెస్ట్ పార్ల‌మెంటేరియ‌న్ గా పేరొందినా మూలాలు మ‌రిచి పోని, విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన రాజ‌కీయ వేత్త‌. మేధావి. బ‌హుభాషా కోవిదుడు.

అన‌ర్ఘ‌లంగా ఏ అంశ‌మైనా మాట్లాడే స‌త్తా క‌లిగిన విల‌క్ష‌ణ లీడ‌ర్. వ‌క్త‌, ర‌చ‌యిత‌, మేధావి, తాత్వికుడు కూడా.

ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టారు.

ఆ ప‌ద‌వుల‌కే ఆయ‌న వ‌న్నె తెచ్చారు. వాగ్ధాటి ఆయ‌న సొంతం. ఒక ర‌కంగా చెప్పాలంటే న‌డిచే వికీ పీడియా అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా మాడ్గుల ఆయ‌న‌ది.

ఇప్పుడున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు ద‌గ్గ‌రి బంధువు కూడా.

సుదీర్ఘ రాజ‌కీయ తెలంగాణ చ‌రిత్ర‌లో జైపాల్ రెడ్డి పేరు లేకుండా మాట్లాడ‌లేం.

ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావ‌డంలో తెర వెనుక ఉండి న‌డిపించింది మాత్ర‌మే ఆయ‌నే.

సోనియా గాంధీకి విడ‌మ‌ర్చి చెప్ప‌డంలో, తెలంగాణ బిల్లు పాస్ చేయించ‌డంలో జైపాల్ రెడ్డినే (S Jaipal Reddy)కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఆనాడు టెలికమ్యూనికేష‌న్స్ మంత్రిగా ఉంటూ రిల‌య‌న్స్ కు చుక్క‌లు చూపించిన ఘ‌న‌త కూడా జైపాల్ రెడ్డిదే.

ఏకంగా ఫైన్ వేయించిన మ‌గోడు ఈ రెడ్డి. 1942 జ‌న‌వ‌రి 16న పుట్టారు. 2019 జూలై 28న క‌న్నుమూశారు.

77 ఏళ్లు బ‌తికారు. పోలియో సోకినా ప‌ట్టుద‌ల‌తో గొప్ప లీడ‌ర్ గా ఎదిగారు జైపాల్ రెడ్డి. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఓ కూతూరు ఉంది.

ఐదు సార్లు లోక్ స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. పాల‌మూరు, చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించారు.

జ‌న‌తాద‌ళ్ లో కీల‌కంగా వ్య‌వ‌హరించారు. ఏఐసీసీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు కూడా.

1998లో గుజ్రాల్ ప్ర‌భుత్వంలో స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 1999లో 21 ఏళ్ల త‌ర్వాత కాంగ్రెస్ లోకి వ‌చ్చాడు.

2004లో మిర్యాల‌గూడ నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యాడు.

కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ని చేశారు. దీంతో పాటు కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువు శాఖ మంత్రిగా ఉన్నారు.

2012 నుంచి 2014 దాకా సైన్స్ అండ్ టెక్నాల‌జీ మినిస్ట‌ర్ గా ప‌ని చేశారు.

18 నెల‌ల వ‌య‌సులో పోలియో బారిన ప‌డినా మొక్క‌వోని ధైర్యంతో అత్యున్న‌త స్థాయికి చేరుకున్న అరుదైన నాయ‌కుడు జైపాల్ రెడ్డి(S Jaipal Reddy).

ఓయూలో ఎంఏ చేశాడు. ఏపీ రాష్ట్రంలో క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాడు.

1969 నుంచి 1984 వ‌ర‌కు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ను వీడారు. 1977లో జ‌నతా పార్టీలో చేరాడు.

1985 నుంచి 1988 దాకా ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. 1984లో పాల‌మూరు ఎంపీగా గెలుపొందాడు. 1990-1996, 1997-1998 దాకా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

1991 నుంచి 92 దాకా రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్నారు. 1998లో అత్యుత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ పుర‌స్కారం అందుకున్నారు.

ద‌క్షిణ భార‌త దేశం నుంచి ఈ అవార్డును పొందిన మొద‌టి లీడ‌ర్ జైపాల్ రెడ్డి. తెలంగాణ ఉన్నంత వ‌ర‌కు జైపాల్ రెడ్డి బ‌తికే ఉంటారు.

Also Read : యూపీలో ‘రావ‌ణ్’ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!