MG Ramachandran : తమిళనాట చెరగని ముద్ర వేసిన నాయకుల్లో ఎంజీఆర్ ఒకడు. నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ ఆయన జయంతి. ఎంజీఆర్ అసలు పేరు మారుతుర్ గోపాల రామచంద్రన్(MG Ramachandran) .
1917 జనవరి 17న పుట్టారు. 1987 డిసెంబర్ 24న కన్ను మూశారు. చలన చిత్ర నిర్మాత కూడా.
1977 నుంచి 1987 వరకు మరణించేంత దాకా తమిళనాడుకు సీఎంగా ఉన్నారు. జయలలితకు గురువు.
అన్నాడీఎంకేను స్థాపించింది కూడా ఆయనే. ఎంజీఆర్(MG Ramachandran ) చనిపోయాక ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న పౌర పురస్కారాన్ని అందజేసింది.
ఎంజీఆర్, అన్న ఎంజీ చక్రపాణి నాటక బృందంలో పని చేశారు.
గాంధీ ఆశయాల ప్రభావంతో ఎంజీఆర్ కాంగ్రెస్ లో చేరారు. 1936లో సతీ లీలావతి మూవీలో సహాయ పాత్రలో సినీ రంగ ప్రవేశం చేశాడు. 1940 తర్వాత ఎంజీఆర్ కీలక నటుడిగా ఎదిగారు.
ఎంజీఆర్ సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని డీఎంకేలో సభ్యుడయ్యాడు. 1972లో అన్నాదురై మరణించాక ఆ పార్టీని వీడాడు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజం – ఏఐఏడీఎంకేను స్థాపించాడు.
ఐదేళ్ల తర్వాత ఎంజీఆర్ 1977 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమిని విజయ తీరాలకు చేర్చింది. డీఎంకేకు షాక్ ఇచ్చింది. అప్పుడు ఎంజీఆర్ సీఎం అయ్యాడు.
భారత దేశ చరిత్రలో మొదటిసారి సినీ నటుడు సీఎంగా కొలువు తీరారు. ఆ తర్వాత ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకున్న నందమూరి తారక రామారావు ఏపీ సీఎంగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత జయలలిత కొలువుతీరారు. 1980లో ప్రభుత్వాన్ని పడగొట్టింది కేంద్రం. 1980, 1984 లో అన్నాడీఎంకేను విజయం వరించేలా చేశాడు. మూత్ర పిండాల వ్యాధికి గురయ్యాడు.
నేను ఎందుకు పుట్టాను అనే పేరుతో ఆత్మకథ రాశాడు. ఇది 2003లో విడుదలైంది. పలు సినిమాల్లో నటించాడు. తొలి నాళ్లల్లో హిందు భక్తుడ. ఆ తర్వాత హేతువాదిగా మారి పోయాడు.
తమిళనాడు ప్రజలు ఇప్పటికీ ఎంజీఆర్ ను దైవంగా కొలుస్తారు. పేదలకు ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. మధ్యాహ్న భోజన పథకంతో ఎల్లప్పటికీ తమతోనే ఉంటారని తమిళులు చెబుతారు.
Also Read : గులాబీ దళపతి వ్యూహంపై ఉత్కంఠ
Madyalo aa daridrudu ramarao gadi gurinchi enduku