Kamal Khaddar :కమల్ హాసన్ ఏది చేసినా అది ఓ సంచలనమే. ఆయన భారతదేశం గర్వించ దగిన నటుడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టారు. కానీ ఏ ఒక్క సీటు గెల్చుకోలేక పోయారు.
చివరకు తాను కూడా విజయం సాధించ లేక మిన్నకుండి పోయారు. అవినీతి రహిత తమిళనాడును సాధించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు.
తీరా ఎంకే స్టాలిన్ అనూహ్యంగా పవర్ లోకి వచ్చాడు. ఇదే సమయంలో ఉలగ నాయగన్ కమల్ గత ఏడాది 2021 నవంబరులో అమెరికాలోని చికాగోలో తన దుస్తుల శ్రేణి కేహెచ్ హౌస్ ఆఫ్ ఖద్దర్ Kamal Khaddar)ను ప్రారంభించారు.
దీంతో ఆయన సరికొత్త గా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. భారతీయ చేనేత కార్మికులను ఆదు కోవడానికి , దేశానికి చెందిన నేతన్నలు నేసిన వస్తువులను తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈనెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆన్ లైన్ లోకి రానున్నట్లు ప్రకటించాడు కమల్ హాసన్. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
భారతీయులంతా ఎక్కడున్నా సరే ఖద్దరు ను ప్రోత్సహించాలని, అంతే కాకుండా ఒక రోజు విధిగా ధరించాలని పిలుపునిచ్చారు ఈ అగ్ర నటుడు. ఫ్యాషన్ డిజైనర్ నమ్రతతో కలిసి ఫోటో కూడా షేర్ చేశాడు.
కేహెచ్ హెచ్ కే మీ వద్దకు వస్తోంది. ఖద్దరు ధరించండి అని పేర్కొన్నారు. ఖద్దర్(Kamal Khaddar) లో భారతీయత దాగి ఉంది. ఈ ఖద్దర్ ను ధరించి గాంధీ ఉద్యమాన్ని నడిపారు.
స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది కూడా ఇదేనని పేర్కొనడం విశేషం.
Also Read : మెగా ఫ్యాన్స్ కు ఖుష్ కబర్