Liam Livingstone : నిన్నటి దాకా ఐపీఎల్ లో ఎదురే లేకుండా సాగి పోతున్న గుజరాత్ టైటాన్స్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ను 142 పరుగులకే కట్టడి చేసింది పంజాబ్ . 8 వికెట్లు కోల్పోయింది.
ఇందులో కగిసో రబాడా దెబ్బకు ఠారెత్తి పోయారు గుజరాత్ బ్యాటర్లు. 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. ఈ తరుణంలో టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడింది.
వెటరన్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 53 బంతులు ఎదుర్కొని 62 రన్స్ చేశాడు. ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్(Liam Livingstone )తన సత్తా ఏమిటో చూపించాడు.
కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 30 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ధావన్ , లివింగ్ స్టోన్ లు కలిసి పంజాబ్ కు చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టారు.
పాయింట్ల పట్టికలో టాప్ రేంజ్ లో ఉన్న గుజరాత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. ఇక లివింగ్ స్టోన్ బ్యాటింగ్ తీరు దిగ్భ్రాంతిని కలిగించేలా ఉంటుంది.
లివింగ్ స్టోన్ పూర్తి పేరు లియామ్ స్టీఫెన్ లివింగ్ స్టోన్ . 4 ఆగస్టు 1993లో పుట్టాడు. వయసు 28 ఏళ్లు. ఇంగ్లాండ్ లోని కుంబ్రియాలో పుట్టాడు. కుడి చేతి బ్యాటర్. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 లలో బెంగళూరు వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో లివింగ్ స్టోన్ ను చేజిక్కించుకుంది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం.
Also Read : మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ పెళ్లి వైరల్