LIC For Sale Comment : అంగట్లో ఎల్ఐసీ అమ్మకానికి సిద్దం
చైర్మన్ పోస్టు రద్దు సిఇఓ పోస్ట్ రెడీ
LIC For Sale Comment : కోట్లాది మందికి భరోసా కల్పిస్తూ వచ్చిన జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) కూడా అంగట్లోకి(LIC For Sale) వచ్చేసింది. ప్రపంచంలోని జీవిత భీమా రంగంలో నెంబర్ వన్ గా గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్నది.
అమ్మకం అనేది అభివృద్దికి పునాదిగా మారి పోయిన ఈ తరుణంలో ఎవరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం. ఓ వైపు మతం మార్కెట్ రంగాన్ని శాసిస్తోంది. దాని ఆధారంగానే రాజకీయాలు కొనసాగుతున్నాయి.
అది లేకుండా ఏదీ ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా లేదా నిలదీసే ప్రయత్నం చేసినా అది నేరం అవుతుంది. లేదా
దేశ ద్రోహం కిందకు వస్తుంది.
ప్రశ్నించడం అన్నది లేక పోతే అది నియంతృత్వానికి దారి తీస్తుందని ఆనాడే మార్క్స్ హెచ్చరించాడు.
ఇవాళ బాసిజం, ఫాసిజం, క్యాపిటలిజం ఒక్కటై పోయాయి. దానికి అధికారం తోడైంది. ఇవాళ చట్ట సభలు ఉన్నా లేనట్టుగా మారి పోయాయి. ఎవరు దేని కోసం మాట్లాడుతున్నారో ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ఉన్నారో తెలియడం లేదు.
ఒక సంస్థను అమ్మకానికి పెట్టినప్పుడు దేని కోసం అమ్ముతున్నామో ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా. ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్రను ఇవాళ
సోషల్ మీడియా నిలదీస్తోంది.
ఇప్పుడు దానిని కూడా నియంత్రించేందుకు రంగం సిద్దం అవుతోంది. కొందరు బడా వ్యాపారవేత్తల సమూహం ఇవాళ సమున్నత భారత దేశాన్ని శాసిస్తోంది. ఇది అవునన్నా కాదన్నా వాస్తవం.
ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రతిసారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో దేశంలో చోటు చేసుకున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి రావడం లేదు.
ఎందుకని అనేది ఆలోచించాలి. ఇక ఎవరైనా .. ఏ సంస్థ లేదా ఏ కంపెనీ అయినా నష్టం వస్తే దానిని పునరుద్దరించే ప్రయత్నం చేస్తారు. కొంత సమయం ఇస్తారు.
కానీ గత 66 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా మరింత రోజు రోజుకు విశ్వసనీయతను పెంచుకుంటూ ప్రజల మన్నననలు పొందుతూ తనను తాను గొప్ప సంస్థగా ప్రూవ్ చేసుకున్న జీవిత భీమా సంస్థ(LIC For Sale) ఇప్పుడు అమ్మకానికి రెడీ అయ్యింది.
ప్రభుత్వ పరంగా నియంత్రణ ఉండేది. కానీ దానిని కూడా లేకుండా చేస్తున్నారు. మెల మెల్లగా ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ వాటాను తగ్గించు కోవడం
ద్వారా ప్రైవేట్ కు అవకాశం కల్పించేలా చేస్తుండడం అత్యంత ప్రమాదకరం. రేపో మాపో ఎల్ఐసీ చైర్మన్ పోస్టు పదవీ కాలం పూర్తవుతుంది.
ఇక ఆయన స్థానంలో వేరే వాళ్లను నియమించదు మోదీ సర్కార్. కోట్లాది రూపాయల ఆస్తులు, అంతకు మించిన ఆదాయం కలిగిన ఎల్ఐసీని మరింత
ముందుకు తీసుకు వెళ్లేందుకు గాను సిఇఓ పోస్ట్ క్రియేట్ చేయబోతోందట ప్రభుత్వం. ఈ మేరకు మార్పులు, విధి విధానాలు తయారు చేసే పనిలో పడింది.
అంటే విలువైన , ఆదాయం కలిగిన సంస్థ త్వరలో ప్రైవేట్ పరం కాబతోందన్నమాట. ఇక ఎల్ఐసీకే భద్రత లేనప్పుడు పాలసీదారులకు ఏం భరోసా ఇస్తుంది.
ఇకనైనా ప్రజలు మేలుకోవాలి. ప్రతిపక్షాలు అడ్డుకోవాలి. లేక పోతే దేశాన్ని అమ్మేందుకు సిద్ద పడతారనేది వాస్తవం.
Also Read : భవిష్యత్తులో భారత్ ను తట్టుకోలేం