Fortune 500 List LIC : పార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో ఎల్ఐసీ

రిల‌య‌న్స్ కంపెనీని దాటిన బీమా సంస్థ‌

Fortune 500 List LIC :  భార‌త దేశంలో విశిష్ట సేవ‌లు అందిస్తున్న సంస్థ‌ల‌లో ఒక‌టిగా పేరొందింది భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). తాజాగా ఫార్చ్యూన్ గ్లోబ‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ గా 500 అత్యుత్త‌మ సంస్థ‌ల‌ను ప్ర‌క‌టించింది.

అందులో ప్ర‌భుత్వ ఆధీనంలోని ఎల్ఐసీకి(Fortune 500 List LIC) చోటు ద‌క్కింది. ఇందులో జీవిత బీమా సంస్థ‌తో పాటు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ లిమిటెడ్ కంటే లిస్టులో అగ్ర‌స్థానంలో ఏకైక భార‌తీయ కంపెనీగా నిలిచింది.

భార‌తీయ సంస్థ‌ల‌లో ఎల్ఐసీ అగ్ర‌స్థానంలో ఉంది. ఇక అనిల్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ 51 స్థానాలు ఎగ‌బాకింది. 97.26 బిలియ‌న్ల ఆదాయం , 553.8 మిలియ‌న్ల లాభంతో దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ నిలిచింది.

ఇప్పుడే విడుద‌ల చేసిన ఫార్చ్చూన్ 500 జాబితాలో 98వ స్థానంలో ఉంది. 2022 జాబితాలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ 51 స్థానాలు ఎగ‌బాకి 104కి చేరుకుంది. విక్ర‌యాల వారీగా లిస్టెడ్ కంపెనీల‌కు ర్యాంక్ ఇచ్చే జాబితాలో ఎల్ఐసీ చేర‌డం విశేషం.

యుఎస్ రిటైల‌ర్ వాల్ మార్ట్ అగ్ర‌స్థానంలో ఉన్న ఈ లిస్టులో తొమ్మిది భార‌తీయ కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఐదు ప్ర‌భుత్వ యాజ‌మాన్యం, నాలుగు ప్రైవేట్ రంగానికి చెందిన‌వి.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐపీఓతో వ‌చ్చిన తొలి ఎల్ఐసీ మాత్ర‌మే భార‌తీయ కార్పొరేట్ల‌లో రిల‌య‌న్స్ కంటే ఉన్న‌త స్థానంలో నిలిచింది.

ఇక ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐఓసీ) 28 స్థానాలు ఎగ‌బాకి 142 ర్యాంక్ కు చేరుకుంది. ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ (ఓఎన్జీసీ) 16 స్థానాలు ఎగ‌బాకి 190కి చేరుకుంది.

టాటా మోటార్స్ 370 , టాటా స్టీల్ 435 వ స్థానంలో నిలిచాయి. రాజేష్ ఎక్స్ పోర్ట్ 437 ర్యాంక్ తో జాబితాలో ఉన్న ఇత‌ర ప్రైవేట్ భార‌తీయ కంపెనీ ఉంది.

ఎస్బీఐ 17 స్థానాలు ఎగ‌బాకి 236 ర్యాంక్ కు చేరుకుంది. భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ 19 స్థానాలు ఎగ‌బాకి 295 కి చేరుకుంది.

Also Read : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ భ‌ళా

Leave A Reply

Your Email Id will not be published!