PAN Aadhar Linking : ఆధార్ తో పాన్ కార్డు లింకు త‌ప్ప‌నిసరి

మార్చి 31 వ‌ర‌కు డెడ్ లైన్ లేక పోతే చెల్లదు

PAN Aadhar Linking : కేంద్ర ఆదాయ ప‌న్ను శాఖ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలోని ఆధార్ కార్డు క‌లిగిన వారంద‌రు విధిగా పాన్ కార్డు క‌లిగి ఉండాల‌ని పేర్కొంది. అంతే కాదు ఇప్ప‌టి వ‌ర‌కు ఆధాకార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవాల‌ని లేక‌పోతే అది చెల్లుబాటు కాద‌ని హెచ్చరించింది.

ఇప్ప‌టికే ప‌లువురు ఇంకా ఆధార్ కార్డుల‌తో పాన్ కార్డుల‌ను లింకు చేసుకోలేద‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపింది ఆదాయ ప‌న్ను శాఖ‌. ప‌లుమార్లు లింకు చేసుకోవాల‌ని సూచించినా ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డింది. ఈ మేర‌కు వ‌చ్చే ఏడాది 2023 మార్చి 31 వ‌ర‌కు డెడ్ లైన్ విధించిన‌ట్లు తెలిపింది.

ఆ త‌ర్వాత పాన్ కార్డు ఉన్నా లేన‌ట్టేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు అవ‌కాశం ఇచ్చామ‌ని కానీ ఆధార్ కార్డు దారులు, పాన్ కార్డు క‌లిగిన వారు ప‌ట్టించు కోలేద‌ని, లింకు(PAN Aadhar Linking)  చేసుకోలేద‌న్న విష‌యాన్ని తాము గుర్తించామ‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా కోట్లాది మంది పాన్ కార్డు లేకుండానే ఆధార్ కార్డుల‌తో వ్యాపార లావాదేవీలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

దీని కార‌ణంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గి పోతోంది. దీని వ‌ల్ల ఎంత మందికి ఏమేం ఆస్తులు, న‌గ‌దు ఉంద‌నే విష‌యం తెలియ‌కుండా పోతోంది. ఒక వేళ ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేస్తే మొత్తం వివ‌రాల‌న్నీ తెలుసుకునేందుకు వీలు కుదురుతుంది.

అందుకే డెడ్ లైన్ విధించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికైనా ఎవ‌రైనా లింకు చేసుకోక పోతే వెంట‌నే త్వ‌ర‌ప‌డండి.

Also Read : రిటైల్ దిగ్గ‌జం మెట్రో రిల‌య‌న్స్ ప‌రం

Leave A Reply

Your Email Id will not be published!