Lionel Messi : చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ

అత్య‌ధిక పారితోషంకంలో టాప్

Lionel Messi : వ‌ర‌ల్డ్ వైడ్ గా అత్య‌ధిక అభిమానుల‌ను క‌లిగిన అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల‌ర్ లియోన‌ల్ మెస్సీ కొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇప్ప‌టికే క‌ళ్లు చెదిరే గోల్స్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

ఫోర్బ్స్ ప‌త్రిక ప్ర‌తి ఏటా ప్ర‌పంచంలో అత్య‌ధిక పారితోష‌కం అందుకునే ఆట‌గాళ్ల జాబితాను ప్ర‌క‌టిస్తుంది.

ఈ ఏడాది 2022కు సంబంధించి లియోన‌ల్ మెస్సీ(Lionel Messi)  టాప్ లో నిలిచాడు.

ప్ర‌తి ఏటా కోట్లాది రూపాయ‌లు అత‌డిని వ‌రిస్తున్నాయి. మోస్ట్ వాల్యూబుల్ , బ్రాండ్ క‌లిగిన అథ్లెట్ గా నిలిచాడు మెస్సీ.

అథ్లెట్ లిస్టులో మెస్సీ(Lionel Messi)  నెంబ‌ర్ వ‌న్ లో ఉంటే దిగ్గ‌జ ఎన్బీఏ స్టార్ ఆట‌గాడు జేమ్స్ రెండో స్థానంలో నిలిచాడు.

ఇక పోర్చుగ‌ల్ ఫుట్ బాల‌ర్ రొనాల్డో మూడో ప్లేస్ లో నిలిచాడు. ఈనెల మే1 , 2022 ముగిసే వ‌ర‌కు 131 మిలియ‌న్ డాల‌ర్ల రెమ్యూన‌రేష‌న్ అందుకుని రికార్డు బ్రేక్ చేశాడు.

ఇందులో 55 మిలియ‌న్ డాల‌ర్లు కేవ‌లం ఎండార్స్ మెంట్ రూపంలో సంపాదించ‌డం విశేషం.

రెండో ప్లేస్ లో లెబ్ర‌న్ 121 మిలియ‌న్లు, పోర్చుగ‌ల్ కెప్టెన్ రొనాల్డో 115 మిలియ‌న్ డాల‌ర్లు తీసుకున్ని మూడో స్థానంలో నిలిచాడు.

మ‌రో ఆట‌గాడు బ్రెజిల్ స్టార్ ఫుట్ బాల‌ర్ నెయ్ మ‌ర్ 95 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించి నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టీఫెన్ క‌ర్రీ 92.8 మిలియ‌న్ డాల‌ర్ల‌తో ఐదో ప్లేస్ లో నిలిచాడు.

ఆ త‌ర్వాతి స్థానాల‌లో కెవిన్ డురంట్ 92 మిలియ‌న్ డాల‌ర్లు, స్విస్ టెన్నిస్ స్టార్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ 90.7 మిలియ‌న్ డాల‌ర్లు,

మెక్సిక‌న్ బాక్స‌ర కానెలో 90 మిలియ‌న్ డాల‌ర్లు, టామ్ బ్రాడీ 83.9 మిలియ‌న్ డాల‌ర్లు, గియ‌నిస్ 80.9 మిలియ‌న్ డాల‌ర్ల‌తో జాబితాలో చోటు సంపాదించారు.

ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన 100 మంది ప్లేయ‌ర్ల జాబితాలో భార‌త క్రీడా రంగం నుంచి స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ 61వ ప్లేస్ లో నిలిచాడు. 33.9 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించాడు.

ఇందులో 31 మిలియ‌న్ డాల‌ర్లు కేవ‌లం ఎండార్స్ మెంట్ రూపంలో రావ‌డం గ‌మ‌నార్హం.

 

Also Read : నా క‌ల నెర‌వేరింది – స‌కారియా

Leave A Reply

Your Email Id will not be published!