Lionel Messi : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కలను నిజం చేశాడు. తన చిరకాల కోరిక నెరవేరింది. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022ను తన సారథ్యంలో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. టోర్నీ ప్రారంభం నుంచి ఫైనల్ పోరు దాకా తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కోట్లాది అభిమానులకు సాకర్ ఫీవర్ అంటే ఏమిటో చూపించాడు.
35 ఏళ్ల లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇక ఆడలేనంటూ ప్రకటించాడు. మనిషి ప్రయాణానికి ముగింపు ఉంటుందేమో కానీ విజేతకు ఉండదు. లోకం ఉన్నంత దాకా ఫుట్ బాల్ ఉన్నంత కాలం మెస్సీ చిరస్థాయిగా నిలిచే ఉంటాడు. ఎందుకంటే అతడు కష్టాలను అధిగమించాడు. కన్నీళ్లను దాటుకుని విశ్వ విజేతగా అవతరించాడు.
అందుకే విజయం అనంతరం సగర్వంగా కప్ ను ముద్దాడాడు. కానీ ఒక్క మాట అన్నాడు. ఇది నా గెలుపు కాదు సమిష్టి విజయం. ఈ మొత్తం విజయం నా దేశానికి, యావత్ ప్రపంచంలోని సాకర్ అభిమానులకు అంకితం ఇస్తున్నానని ప్రకటించాడు మెస్సీ. అంతే కాదు అరుదైన ఘనతను సాధించాడు.
తన పేరుతో రికార్డు క్రియేట్ చేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 26 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. 25 మ్యాచ్ లు ఆడిన మాజీ జర్మన్ ప్లేయర్ లోథర్ మథాస్ ను అధిగమించాడు లియోనెల్ మెస్సీ(Lionel Messi).
ఈ సందర్భంగా కన్నీళ్లను ఆపుకోలేక పోయాడు లియోనెల్ మెస్సీ. ఇది అరుదైన క్షణం. అద్భుతమైన సన్నివేశం. ఇలాంటి ఉద్విగ్న భరిత సన్నివేశం కోసం కొన్నేళ్ల పాటు నిరీక్షించానని అన్నాడు.
Also Read : మెస్సీ మ్యాజిక్ మోదీ మెస్మరైజ్