Lioyd Austin : ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో భారత దేశం తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. మరో వైపు యావత్ ప్రపంచం రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించింది.
రష్యా ఎల్లప్పటికీ తమకు ఇండియా మిత్ర దేశంగా ఉంటుందని స్పష్టం చేశారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి లావ్ రోవ్(Lioyd Austin ). ఈ తరుణంలో రష్యాతో గనుక డీలింగ్స్ లేదా ఒప్పందాలు చేసుకున్నట్లయితే భారత్ పై కూడా తాము ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది అమెరికా.
దీనిని బేఖాతర్ చేస్తూ భారత్ ముందుకే సాగింది. ఇప్పటికే లావ్ రోవ్(Lioyd Austin )తో చమురు, టెక్నాలజీ, తదితర రంగాలకు సంబంధించి యధావిధిగా బంధం కొనసాగుతుందని పేర్కొంది.
ఈ తరుణంలో అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించు కోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నర్మ గర్భంగా హెచ్చరించారు.
రష్యన్ పరికరాలలో పెట్టుబడులు పెట్టడం వారికి శ్రేయస్కరం కాదని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుందన్నారు. తాము కూడా ఇదే విషయాన్ని భారత్ కు తెలియ చేస్తున్నామని వెల్లడించారు లాయిడ్ ఆస్టిన్.
కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్ తీవ్రంగా మండిపడ్డారు. భారత్ పట్ల అమెరికా ఎందుకు కఠిన వైఖరి అనుసరించడం లేదని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరొందిన ఇండియా ఇప్పుడు ఆయుధ సంపత్తిని కలిగిన రష్యాను ఎంచు కోవడంలో పరమార్థం ఏమిటని నిలదీశారు.
Also Read : డబ్బులతో పారి పోయిన ఫరా ఖాన్