Liquor Sale Close : మూడు రోజులు మందు బంద్
ఎన్నికల వేళ ఎన్నికల సంఘం
Liquor Sale Close : తెలంగాణ – కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈసీ(EC) ఇప్పటికే దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా గెజిట్ కూడా ప్రకటించింది. అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
Liquor Sale Close in Election States
ఇందులో భాగంగా భారీ ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈసారి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది ఈసీ. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సిఈవో) వికాస్ రాజ్ సంచలన ప్రకటన చేశారు.
ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో మందు బాబులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా చుక్క మందు కూడా కనిపించ కూడదని స్పష్టం చేశారు. ఏ మాత్రం రూల్స్ అతిక్రమించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నవంబర్ 28, 29, 30వ తేదీలలో మద్యం అమ్మకాలు కానీ, సరఫరా కానీ ఉండదని కుండ బద్దలు కొట్టింది ఈసీ. సో మద్యం బాబులు ఈసీ తీసుకున్న నిర్ణయంతో విస్తు పోయారు.
Also Read :IPL Auction 2024 : ఐపీఎల్ వేలం పాట ఖరారు