CM KCR : స్వామీ క‌రుణించు న‌న్ను గెలిపించు

కోనాయిప‌ల్లిని సంద‌ర్శించిన సీఎం

CM KCR : సిద్దిపేట – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో సీఎం కేసీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. నిన్న‌టి దాకా ఫామ్ హౌస్ లో మూడు రోజుల పాటు రాజ్యాధికారం కోసం రాజ శ్యామల యాగం నిర్వ‌హించారు. తాజాగా ప్ర‌తి సారి తన‌కు ఇష్ట దైవంగా భావించే శ్రీ‌నివాసుడిని ద‌ర్శించు కోవ‌డం అల‌వాటు.

CM KCR Viral with Temples

సిద్దిపేట జిల్లా లోని కోనాయి ప‌ల్లి లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి విచ్చేశారు. సీఎం రాక సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఆల‌య క‌మిటీ, పూజారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు సీఎం కేసీఆర్(CM KCR) కు. ఆయ‌న వెంట ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉన్నారు.

అంత‌కు ముందు కేసీఆర్ స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టారు. అనంత‌రం ఎన్నిక‌ల సంద‌ర్బంగా తాను పోటీ చేయ‌బోయే ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌త్రాల‌ను స్వామి వారి చెంత ఉంచారు. ఈసారి కూడా మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా చూడాల‌ని శ్రీ‌నివాసుడిని కోరుకున్నారు.

ఇదిలా ఉండ‌గా 1985 నుండి నామినేష‌న్ కు ముందు కోనాయ‌ప‌ల్లిని సంద‌ర్శించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

Also Read : Liquor Sale Close : మూడు రోజులు మందు బంద్

Leave A Reply

Your Email Id will not be published!