సీఎం విజ‌య్ భార్య సంగీత క‌లిసి పోతారా..?

స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న త‌ల్లి

చెన్నై : త‌మిళ‌నాడు అగ్ర న‌టుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న‌తో త‌న‌కు విడాకులు కావాలంటూ భార్య సంగీత సోర్న‌లింగం ఏకంగా కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చారు. విజ‌య్ తో న‌టి త్రిష కృష్ణ‌న్ క‌లిసి ఉండ‌డం, స‌న్నిహితంగా ఉండ‌డంతో తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విజ‌య్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా స్పందించాడు. అది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌ద్దంటూ కోరాడు. ప్ర‌స్తుతం విజ‌య్, సంగీత విడాకుల కేసు జూన్ 15న మంగ‌ళ‌వారం తిరిగి కోర్టులో విచార‌ణ‌కు రానుంది.

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది ప్రారంభంలో ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ కింద ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. సంగీత పలు కీలక కార్యక్రమాలకు హాజరు కాక పోవడంతో వారి విడి పోతారనే ఊహాగానాలు మ‌రింత‌ బలపడ్డాయి. విజయ్ రాజకీయ ప్రచారాలు, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సంగీత‌ దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆమె తమ ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. అక్కడ ఎక్కువ కాలం గడుపుతుండటం ఈ విడిపోతారనే వార్తలకు మరింత ఆజ్యం పోసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం వారి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.

ఈ జంట తమ విభేదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి చర్చలు ఘర్షణ ధోరణి నుండి చర్చల దశకు మారాయి. విజయ్ తల్లి వారి మధ్య సంభాషణకు సహకరిస్తున్నారని సమాచారం. ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ, విజయ్ వ్యక్తిగత జీవితం గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోనే ఉన్నాయి. విడాకుల వార్తలు వస్తున్నప్పటికీ విజయ్ అభిమానులు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. ఆయన సంగీతతో మళ్లీ కలుస్తారని వారు బలంగా నమ్ముతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!